amp pages | Sakshi

పోలీస్‌గా భరత్‌

Published on Wed, 10/04/2017 - 01:23

తమిళసినిమా: చిన్న గ్యాప్‌ తరువాత నటుడు భరత్‌ మళ్లీ వరుస చిత్రాలతో వేగాన్ని పెంచారు. ఈయన నటించిన పొట్టు చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. తాజాగా పోలీస్‌ అధికారిగా దుమ్మురేపడానికి రెడీ అవుతున్నారు. లిప్పింగ్‌ హార్స్, ఇంక్రెడబుల్‌ ప్రొడక్షన్స్, దినా స్టూడియోస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ  చిత్రంలో నటుడు భరత్‌ పోలీస్‌ అధికారిగా పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈయన పోలీస్‌ పాత్రలో నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. భరత్‌తో పాటు సురేశ్‌మీనన్, ఆదవ్‌ కన్నదాసన్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతల్ని శ్రీ సెంథిల్‌ నిర్వహిస్తున్నారు. ఈయన నాళై ఇయక్కునార్‌ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచారన్నది గమనార్హం.

ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం, సురేశ్‌బాల ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఈయన ఛాయాగ్రహకుడు వేల్‌రాజ్, బాలసుబ్రమణియన్‌ల శిష్యుడన్నది గమనార్హం. ఈ చిత్రం విజయదశమి సందర్భంగా చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇది సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో హీరోయిన్‌గా ఒక ప్రముఖ నటిని నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. చిత్ర టైటిల్‌ను, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను దీపావళి పండగ రోజున విడుదల చేయనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన ఎంఎస్‌.శివనేశన్‌ తెలిపారు.

Videos

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు

చంద్రబాబు, కొడుకు పప్పు తుప్పు.. అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచెర్ల

"వాళ్లకి ఓటమి భయం మొదలైంది అందుకే ఈ కొత్త డ్రామా.."

వెంకయ్య నాయుడు బామ్మరిది సంచలన కామెంట్స్

"30 లక్షల కోట్లు స్వాహా అందులో 14 లక్షల కోట్లు.." కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

Photos

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)