amp pages | Sakshi

హ్యాపీ బర్త్‌డే టబు.. వైరలవుతున్న ఫోటో

Published on Mon, 11/04/2019 - 20:09

ముంబై: బాలీవుడ్‌ నటి టబు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం పలువురు సినీ ప్రముఖులు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో టబు సోదరి ఫరా నాజ్ తన ఇస్టాగ్రామ్‌ ఖాతాలో..టబుతో దిగిన చిన్ననాటి పాత ఫోటోను షేర్‌ చేశారు. ‘హ్యాపీ బర్త్‌ డే..మై డియర్‌ సిస్టర్’  అని కమెంట్‌ పెట్టారు.  దీంతో  ముద్దుల మూట కడుతున్న   బుల్లి  టబు   ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

తాజాగా టబు తన 47వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఆమె 1994లో బాలీవుడ్‌లో ‘పెహలా పెహలా ప్యార్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చినా పెద్దగా గుర్తింపు  రాలేదు. అయితే అదే ఏడాది ఆమె నటించిన ‘విజయ్‌పథ్’ సినిమా విడుదలై బాక్సీఫీసు వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి తను వెనుదిరిగి చూడలేదు. పలు విజయవంతమైన చిత్రాలు ఆమె ఖాతాలో చేరాయి. టబు..హకీఖత్, జీత్, మాచిస్ (ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకుంది), విరాసాట్, చాచి 420, బీవీ నెం.1 వంటి సినిమాల్లో నటించారు. 2001లో తాను నటించిన ‘చాందిని బార్’ సినిమాకు రెండోసారి ఉత్తమ నటిగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు. తను చివరిగా భారత్, డీ దే ప్యార్ దే, అంధాధున్ వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా తాను నటించిన ‘జవానీ జానెమాన్’ సినిమా నవంబర్‌లో విడుదల కానుంది. 

అల్లు అర్జున్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ చిత్రంలొ టబు ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. యంగ్ హీరో రానా, సాయి పల్లవి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డిఫరెంట్‌ మూవీ విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా కీలక పాత్రలో  టబును అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పాత్రలో నటించేందుకు ముందుగా అంగీకరించిన టబు, తాజాగా డేట్స్‌ అడ్జస్ట్ చేయలేక నో చెప్పారట. బన్నీ, త్రివిక్రమ్‌ సినిమాలో బిజీగా ఉండటంతో విరాటపర్వంలో నటించలేనని చెప్పేశారట.

అయితే టబు సోదరి ఫరానాజ్ కూడా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించారు. 1985లో వచ్చిన ‘ఫాస్లే ’ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన ఆమె యతీమ్, వో ఫిర్ ఆయేగి, బెగునా వంటి చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా నటించిన చిత్రాలు శిఖర్ (2005), హల్చల్ (2004).  కాగా ప్రముఖ నటి షబానా అజ్మీకి టబు మేనకోడలు అన్ని విషయం తెలిసిందే.

టబు రేర్‌ ఫోటోలు:

సోదరి వివాహంలో టబు..

తల్లితో టబు..

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)