amp pages | Sakshi

‘పండగను నాశనం చేశాడు’

Published on Fri, 04/12/2019 - 18:51

‘ట్యూబ్‌లైట్‌’ సినిమా విడుదలైన తర్వాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాను అంటున్నారు బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌. కబీర్‌ ఖాన్‌ దర్శకత్వంలో వచ్చిన ట్యూబ్‌లైట్‌ సినిమాను 2017లో రంజాన్‌ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది. సినిమాలో  చాలా సన్నివేశాల్లో సల్మాన్‌ బాధపడుతూనే ఉండటం ప్రేక్షకులను నిరాశకు గురి చేసింది. 

తాజాగా సల్మాన్‌ ఈ చిత్రం గురించి మాట్లాడారు. ‘‘బజరంగీ భాయ్‌జాన్‌’ (2015) సినిమా హిట్‌ అయిన నేపథ్యంలో.. అదే తరహాలో ఉండే ‘ట్యూబ్‌లైట్‌’ కూడా ఓ అందమైన సినిమా అవుతుందని భావించాం. కానీ పండగ రోజున సంతోషాన్ని ఇచ్చే సినిమా చూడాలని అభిమానులు అనుకున్నారు. ‘ట్యూబ్‌లైట్‌’ చూసి.. వాళ్లంతా ఏడ్చారు. ‘అసలు ఇది ఏం సినిమా.. పండగను నాశనం చేసేశాడు’ అన్నారు. పాపం కొంతమంది అభిమానులు డిప్రెషన్‌లోకి కూడా వెళ్లిపోయారు’ అని తెలిపాడు.

‘ఇవాళ ‘ట్యూబ్‌లైట్‌’ సినిమా డిజిటల్‌ ప్లాట్‌ఫాంపైకి వచ్చింది. టీవీలో సినిమాను చూస్తూ ప్రేక్షకులు చాలా ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రజలకు ఈ సినిమా బాగా నచ్చింది.. మంచి రేటింగ్‌ వస్తోంది. సినిమా దేశవ్యాప్తంగా రూ.110 కోట్లు రాబట్టింది. అంటే.. నా ఫ్లాప్‌ సినిమాలు కూడా వందకోట్లు కలెక్ట్‌ చేస్తాయి కదా. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. చాలా సినిమాలు ఇంత మాత్రం కూడా రాబట్టలేకపోతున్నాయి. అలా చూసుకుంటే నా సినిమా హిట్‌ అయినట్లే కదా. కానీ జనాలు ఈ సినిమాను ఫ్లాప్‌ అనడం విచిత్రంగా ఉంది’ అన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌