amp pages | Sakshi

పంజాబీ పిల్ల... తెలుగు డబ్బింగ్

Published on Tue, 11/24/2015 - 22:18

రకుల్ ప్రీత్‌సింగ్... ఇవాళ తెలుగు సినీ పరిశ్రమలోని నవ యువ కథానాయికల్లో మొదటి వరుసలో ఉన్న గ్లామర్ గర్ల్. తెలుగు తెరకు వచ్చిన గడచిన ఆరేళ్ళలో తొమ్మిది సినిమాల్లో నటించిన హ్యాపెనింగ్ హీరోయిన్. ఈ పంజాబీ అమ్మాయి బయట చక్కగా తెలుగు మాట్లాడతారు. తెలుగు నటీనటులే తెలుగు సరిగ్గా మాట్లాడలేక పోతున్న ఈ రోజుల్లో ఆమె తెలుగు మాట్లాడడం వింటే ముచ్చటేస్తుంది. విషయం ఏమిటంటే, రకుల్ ఇప్పుడు సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకోనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో చిన్న ఎన్టీయార్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో కథానాయిక అయిన రకుల్ అలా వాచికాభినయం కూడా ప్రదర్శించనున్నారు.

‘‘ ‘నువ్వు డబ్బింగ్ చెప్పగలవు’ అంటూ దర్శకుడు సుకుమార్ నన్ను ఎప్పటి నుంచో ప్రోత్సహిస్తున్నారు. గత వారం ఈ సినిమాలో కొన్ని సీన్లకు టెస్ట్ డబ్బింగ్ చెప్పాను. అందరూ నా గొంతు బాగుందన్నారు’’ అని రకుల్ చెప్పుకొచ్చారు. అయితే, బయట ఎంత బాగా మాట్లాడినా, డబ్బింగ్ చెప్పడం వేరు కాబట్టి, కొంత టెన్షన్ ఫీలవుతున్నట్లు ఆమే ఒప్పుకుంటున్నారు.

తెర మీది సన్నివేశంలోని భావోద్వేగాలకు తగ్గట్లుగా మాట్లాడుతూ, ఉచ్చారణ సరిగ్గా ఉండేలా చూసుకోవడం కష్టమని ఒప్పుకుంటూనే అందుకు కావాల్సిన జాగ్రత్తలన్నీ రకుల్ తీసుకుంటున్నారట. గమ్మత్తేమిటంటే, రకుల్ ఇంతవరకూ ఎవరి దగ్గరా  పద్ధతి ప్రకారం తెలుగు నేర్చుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ తనతో కేవలం తెలుగులోనే మాట్లాడ మని మొదట్లోనే చెప్పేశారు. వాళ్ళు మాట్లాడుతున్నది వింటూ, వాళ్ళతో మాట్లాడుతూనే భాష నేర్చేసుకు న్నారు.

‘‘ఆ కష్టం ఇప్పుడు ఫలించింది’’ అని ఈ మిస్ ఇండియా పోటీ ఫైనలిస్ట్ చెప్పుకొచ్చారు. నటిగా ఇంతదాన్ని చేసిన తెలుగు ప్రేక్షకులకూ, పరిశ్రమకూ ఇలా తెలుగులో మాట్లాడుతూ ఋణం తీర్చుకుంటు న్నట్లు రకుల్ భావిస్తున్నారు. ‘నాన్నకు ప్రేమతో’లో లండన్‌లో ఎన్నారైగా కనిపించనున్న రకుల్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తయారవుతున్న సినిమాలో అల్లు అర్జున్ పక్కన ‘అచ్చమైన తెలుగమ్మాయి’ పాత్ర పోషిస్తున్నారు. మొత్తానికి, వేషం... వేషానికి తగ్గ మాటతో తెలుగు నేలతో తన బంధాన్ని ఈ పంజాబీ పిల్ల గట్టిపరుచుకుంటున్నట్లున్నారు. ఆల్ ది బెస్ట్ రకుల్.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)