amp pages | Sakshi

కథా బలం ఉన్న సినిమాలు హిట్టే

Published on Mon, 12/09/2019 - 01:47

‘‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే మంచి సందేశాత్మక చిత్రమని తెలుస్తోంది. ప్రొడక్షన్  విలువలు బాగున్నాయి. అందరూ బాగా నటించారు’’ అని హీరో రాజశేఖర్‌ అన్నారు. సంజయ్‌ ఇదామ, శ్రీనాథ్‌ మాగంటి, అహల్య సురేష్, ప్రియ ముఖ్య తారలుగా జె.కరుణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’. రాహుల్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదలవుతోంది. ఈ సినిమా పాటల విడుదల వేడుకలో రాజశేఖర్‌ మాట్లాడుతూ– ‘‘రాజమౌళిగారి దగ్గర పనిచేసిన కరుణ కుమార్‌ ఈ సినిమాను బాగా తెరకెక్కించారు. యాజమాన్య పాటలు బాగున్నాయి. కథా బలం ఉన్న సినిమాలు ఎప్పుడూ హిట్‌ అవుతుంటాయి.

‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’లో కథతో పాటు సందేశం ఉన్నందున తప్పకుండా సక్సెస్‌ అవుతుంది’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో విద్యార్థుల గురించి ఒక మంచి సందేశం ఉంది. ప్రతి తల్లిదండ్రులు, విద్యార్థులు చూడాల్సిన సినిమా ఇది’’ అన్నారు నటి జీవిత. ‘‘ఈ చిత్రం నాకు నచ్చింది.. అందుకే స్వయంగా విడుదల చేస్తున్నా’’ అన్నారు నిర్మాత మల్కాపురం శివకుమార్‌. ‘‘తెలుగులో నేను తీసిన మూడో సినిమా ఇది. డబ్బు వస్తుందా?లేదా? అనే విషయాలు పక్కన పెడితే మంచి సినిమా తీశానన్న సంతృప్తి ఉంది’’ అన్నారు బి.ఓబుల్‌ సుబ్బారెడ్డి.  ‘‘ఆత్మహత్య సమస్యకు పరిష్కరం కాదని ఈ సినిమాలో చెప్పాం’’ అన్నారు కరుణ కుమార్‌. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, చిత్ర యూనిట్‌ పాల్గొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)