తొలిప్రేమపై రాజమౌళి కామెంట్‌

Published on Mon, 02/12/2018 - 20:26

సాక్షి, హైదరాబాద్‌ : మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, రాశిఖన్నా నటించిన తొలిప్రేమ చిత్రం సినీ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు  చాలా బాగుందంటూ కితాబిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, విలక్షణ నటుడు ఆర్. నారాయణమూర్తిలు ఈసినిమా బాగుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్త పరచగా తాజాగా ఈ జాబితాలోకి దర్శక ధీరుడు రాజమౌళి సైతం చేరారు. సినిమా బాగుందంటూ సోషల్‌ మీడియాలో కితాబిచ్చారు.  

ఈ సందర్భంగా ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ 'నేను సాధారంగా ప్రేమకథ చిత్రాల అభిమానిని కాదు. కానీ ‘తొలిప్రేమ’  సినిమాను మాత్రం ఎంజాయ్ చేశాను. దర్శకుడు వెంకీ తన తొలి చిత్రాన్ని బాగానే హ్యాండిల్ చేశారు. వరుణ్ తేజ్ రోజు రోజుకి మంచి నటుడిగా ఎదుగుతున్నాడు. రాశీఖన్నా అందంగా కనిపించడమే కాదు, అంతకంటే బాగా నటించింది. ప్రసాద్, బాపినీడు గారికి శుభాకాంక్షలు. సినిమా నిర్మాణ విలువలు గొప్పగా ఉన్నాయి.  మంచి విజయాన్ని అందుకున్నారు' అంటూ ప్రశంసించారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ