ఓ రహస్యం చెప్పిన రాజమౌళి

Published on Tue, 08/19/2014 - 20:43

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయవంతమైన దర్శకుడిగా శిఖరాగ్రానికి చేరుకున్న రాజమౌళి  ఎందరో యువ దర్శకులకు ఆదర్శంగా నిలిచారు. ఎందరో నటులను స్క్రీన్పై అద్భుతంగా చూపిన రాజమౌళికి నటనలోనూ ప్రతిభ ఉందా? ఆయన నటనను ఇప్పటి వరకు వెండితెరపై చూడలేదు.

చాలామందికి తెలియని విషయం ఏంటంటే రాజమౌళి దర్శకుడిగా పరిచయం కాకముందే నటుడిగా అరంగేట్రం చేశారు. చిన్నప్పుడు ఓ సినిమాలో నటించారు. కాకపోతే ఆ సినిమా విడుదల కాకపోవడంతో స్క్రీన్పై రాజమౌళిని చూడలేకపోయాం. రాజమౌళే స్వయంగా ఈ విషయాన్ని  చెప్పారు. 'నా చిన్నతనంలో కృష్ణుడి పాత్రలో నటించాను. దురదృష్టవశాత్తూ ఆ సినిమా పూర్తికాలేదు' అని రాజమౌళి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. కృష్ణాష్టమి సందర్భంగా రాజమౌళి ఈ రహస్యాన్ని అభిమానులతో పంచుకున్నాడు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ