amp pages | Sakshi

సారీ రవిప్రకాష్.. పవన్ వ్యంగ్య ట్వీట్

Published on Sat, 04/21/2018 - 16:30

సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ట్వీట్ల పరంపర కొనసాగుతూనే ఉంది. తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక అసలు సూత్రధారి టీవీ9 ఛానల్ సీఈవో రవిప్రకాష్ అని వెల్లడించిన పవన్.. వరుసగా ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. 'రవిప్రకాష్ నిన్ను వేచి చూసేలా చేస్తున్నందుకు క్షమాపణలు. అందుకు కొంత సమయం ఇవ్వు. కొద్దిసేపు వేచి చూడు. రవిప్రకాష్.. నీకు వ్యక్తిగతంగా మెసేజ్ పంపిస్తానంటూ' పవన్ తన తాజా ట్వీట్లో పోస్ట్ చేశారు.

మరోవైపు తన అభిమానులనుద్దేశించి సందేశం పంపారు పవన్. ఈ వివాదంలో ఆవేశపడొద్దదంటూ అభిమానులకు సూచించారు. అభిమానులందరూ సంయమనంతో ఉండాలని కోరారు. వాళ్లు తప్పు చేసి తనపై కేసులు వేస్తున్నారని.. కానీ తాను ఏ తప్పు చేయలేదన్నారు. న్యాయపోరాటం చేస్తానని మరోసారి పేర్కొన్నారు. నిన్న మీడియాపై జరిగిన దాడిలో పోలీసులతో పాటు తాను కూడా నిస్సహాయుడినని సోషల్ మీడియా ద్వారా వివరించారు.

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతూ నటి శ్రీరెడ్డి మొదలుపెట్టిన అంశం అనూహ్య మలుపులు తిరుగుతోంది. శ్రీరెడ్డి పవన్‌ను దూషించడం.. ఆపై తానే దూషించమని చెప్పానంటూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ తెరపైకి రావడంతో వివాదం మరింత పెద్దదైంది. వ్యక్తిగత దూషణలు, తన కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకోవడం వెనుక టీడీపీ అనుకూల మీడియా, నారా లోకేశ్‌ కుట్ర ఉందని పవన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తుండటం తెలిసిందే.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)