amp pages | Sakshi

సినిమా రివ్యూ: నీజతగా...నేనుండాలి

Published on Fri, 08/22/2014 - 14:05

ప్లస్ పాయింట్స్: 
కథ, కథనం
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 
మైనస్ పాయింట్స్: 
హీరోయిన్
డైలాగ్స్, డబ్బింగ్
 
కథ, స్క్రీన్ ప్లే: షగుఫ్తా రఫీఖ్
సంగీతం: మిథున్, జీత్ గంగూలీ, అంకిత్ తివారీ
నిర్మాత: బండ్ల గణేష్
దర్శకత్వం: జయ రవీంద్ర
 
 బాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై..భారీ ఘన విజయాన్ని ఆషికీ-2 సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్, మద్యానికి బానిసై.. విఫలమైన ఓ గాయకుడి కథను నేపథ్యంగా తీసుకుని మ్యూజికల్, లవ్‌స్టోరిగా రూపొందిన ఆషికీ-2 చిత్రాన్ని ప్రాంతాలు భాషలకతీతంగా ప్రేక్షకులు బ్రహ్మరంధం పట్టారు. అదే చిత్రాన్ని తాజాగా  ‘నీజతగా...నేనుండాలి’ టైటిల్‌తో రూపొందించి ఆగస్టు 22 తేదిన విడుదల చేశారు. హిందీలో ఆకట్టుకన్న విధంగానే ‘నీజతగా నేనుండాలి’ ప్రేక్షకులను ఆలరించిందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కథలోకి వెళ్లాల్సిందే. 
 
 కొద్దికాలంలోనే పాపులారిటీని సొంతం చేసుకున్న ఆర్‌జే, గాయకుడు రాఘవ జయరాం. డ్రగ్స్, మద్యానికి బానిసైన రాఘవ క్రమంగా తన పాపులారిటీని క్రమంగా కోల్పోతాడు. ఈ నేపథ్యంలో గాయత్రి నందన అనే బార్ సింగర్‌ను చూసి ఆమెలోని టాలెంట్‌ను ఇష్టపడుతాడు. గాయత్రిని గొప్ప సింగర్ చేయాలని నిర్ణయించుకుంటాడు. గాయత్రిపై ఇష్టం ప్రేమగా మారుతుంది. గాయత్రిని గొప్ప సింగర్ని చేశాడా? సింగర్‌గా రాఘవ మళ్లీ పూర్వ వైభవాన్ని సంపాదించుకున్నాడా?గాయత్రి, రాఘవల ప్రేమ సుఖాంత మవుతుందా అనే ప్రశ్నలకు సమాధానమే నీజతగా నేనుండాలి. 
 
 రాఘవగా సచిన్, గాయత్రిగా నజ్రియాలు నటించారు. తమ శక్తి సామర్ధ్యాల మేరకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. పాధ్యాన్యత ఉన్న పాత్రల్లో నటించిన రావు రమేశ్, శశాంక్‌లు  వారి పాత్రల పరిధి మేరకు పర్వాలేదనిపించారు. 
 
 సగటు సంగీత అభిమానులను హృదయాల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించికున్న ఆషికీ-2 మ్యూజిక్ ఒరిజినల్ ట్రాక్స్ మళ్లీ వినాలనే రేంజ్‌లో ఉన్నాయి. నేపథ్యగీతాలకు చంద్రబోస్ అందించిన సాహిత్యం బాగుంది. 
 
 విశ్లేషణ:  
 దేశవ్యాప్తంగా ఆషికీ-2 చిత్రానికి యువతతోపాటు అన్నివర్గాల నుంచి లభించిన ఆదరణ ఈ మధ్యకాలంలో ఏచిత్రానికి లభించలేదని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అలాంటి చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారంటే అంచనాలు, కంపారిజన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎంత వద్దనుకున్నా.. ఆషికీ-2 చిత్ర ప్రభావం వెంటాడుతునే ఉంటుంది. ఆషికీ-2 చిత్రం ప్రభావం ఆ రేంజ్‌లో ఉంటుంది. 
 
 ‘నీజతగా నేనుండాలి’ చిత్ర విషయానికి వస్తే.. ఆ రేంజ్‌లో ఫీల్ కలిగించలేకపోయిందని చెప్పవచ్చు. అయితే ఈ చిత్రంలో ఇంటెన్సిటిని, ఫీల్‌ను కొనసాగించడానికి జట్టు తమ శాయశక్తులా ప్రయత్నించారు. నటీనటుల యాక్టింగ్‌ను.. డైలాగ్స్, డబ్బింగ్ ఎక్కువగా డామినేట్ చేశాయి. హీరో, హీరోయిన్‌ల ఎంపిక విషయంలో మరికొంత జాగ్రత్త వహించి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఆషికీ-2 చిత్రాన్ని చూడని తెలుగు ప్రేక్షకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. కొన్ని సీన్లలో ఎమోషన్స్‌ను తెరపైన చూపించడంలో సంగీతం, దర్శకుడు జయ రవీంద్ర ప్రతిభ ప్రధానపాత్ర పోషించింది. ఆషికీ-2 చూడని ప్రేక్షకులకు ‘నీజతగా నేనుండాలి’ ఓ ఫీల్‌ను కలిగిస్తుంది కాని.. అద్బుతమైన ఫీలింగ్‌ను మాత్రం కాదు..

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)