amp pages | Sakshi

ఔరా...  ఐరా!

Published on Wed, 01/02/2019 - 00:40

నయనతార నటిస్తున్న తాజా ద్విభాషా (తమిళ, తెలుగు) చిత్రం ‘ఐరా’. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ఇందులో నయనతార డ్యూయల్‌ రోల్‌ చేశారు. సుదర్శన్, సుందరామ్మూర్తి, రవీంద్రన్, కార్తీక్‌ కీలక పాత్రలు పోషించారు. తమిళనాట ‘లక్ష్మీ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌తో మంచి పేరు సంపాదించుకున్న కేఎమ్‌ సర్జున్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ సినిమా సెకండ్‌ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. అలాగే ఈ నెల 5న ఈ సినిమా టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ‘ఐరా’  టీజర్‌ను ఔరా అనిపించేలా చిత్రబృందం కట్‌ చేశారని కోలీవుడ్‌ టాక్‌.

ఇప్పుడు రిలీజ్‌ చేసిన సెకండ్‌ లుక్‌ కూడా ఔరా అనేలానే ఉందని అభిమానులు అంటున్నారు. ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్‌లో విజయ్‌ హీరోగా రూపొందనున్న సినిమాలో, శివ కార్తీకేయన్‌ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాలో ఆమె కథానాయిక. ఇంకా ఆమె చేతిలో మరికొన్ని సినిమాలు ఉన్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... డిసెంబర్‌ 28కి ఇండస్ట్రీలో 15ఏళ్లను పూర్తి చేసుకున్నారు నయన. నటిగా ఆమె వయసు 15 అన్నమాట. ఆమె నటించిన ‘మనసునక్కారే’ మలయాళ చిత్రం 2003లో డిసెంబర్‌ 28న విడుదలైన సంగతి తెలిసిందే. 15 ఏళ్లయినా నయన క్రేజ్‌ తగ్గలేదనడానికి ఆమె చేతిలో సినిమాల లిస్టే ఉదాహరణ. 

Videos

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

ప్రజలు జాగ్రత్త.. బాబుపై ద్వారంపూడి సెటైర్లు

దొంగలు దొరికారు

రాజకీయం కోసం ఎంత నీచానికైనా దిగజారతాడు..కన్నబాబు ఫైర్

హిందూపురానికి బాలకృష్ణ చేసిందేమీ లేదు.. అందుకే ప్రజలు నాకు బ్రహ్మరథం పడుతున్నారు

జగనన్న సంక్షేమమే నన్ను గెలిపిస్తుంది..175/175 పక్కా

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌