amp pages | Sakshi

‘మా’ వివాదం.. శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు

Published on Tue, 03/19/2019 - 12:29

సాక్షి, హైదరాబాద్‌ : మూవీ ఆర్టిస్ట్ అసోషియేన్‌ వివాదం మరింత ముదురుతోంది. నరేష్‌, శివాజీ రాజల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలతో వివాదానికి తెరపడుతుందని భావించినా అలా జరగలేదు. ఎలక్షన్లలో శివాజీ రాజా ప్యానల్‌పై నరేష్‌ ప్యానల్‌ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే గెలిచిన వర్గం ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయాలని భావించినా శివాజీ రాజా అడ్డుపడుతున్నాడంటూ ఆరోపిస్తూ నరేష్‌ వర్గం మీడియా ముందుకు వచ్చారు.
(చదవండి : ‘మా’లో మరో వివాదం)

అయితే ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన శివాజీ రాజా ‘బైలా ప్రకారం ఏప్రిల్‌లో ప్రమాణ స్వీకారం చేయాలని సూచించాను. గతంలో నేను కూడా 25 రోజులు ఆగి ప్రమాణం చేశాను అంతేగాని వారి ప్రమాణం సీక్వారంపై నేను కోర్టుకు వెళతానని చెప్పలేదు’ అన్నారు. ఈ సందర్భంగా శివాజీ రాజా పలు ఆరోపణలు చేశారు. గతంలో మా చాలా బాగుండేది అన్న శివాజీ గత నాలుగేళ్లుగా రాజకీయాలు ప్రవేశించాయని ఆవేదన వ్యక్తం చేశారు.

‘గత 22 ఏళ్లుగా మాలో ఎన్నో పదువుల్లో సేవ చేశాను, ఈసీ మెంబర్‌ నుంచి అధ్యక్షుడి వరకు అన్ని బాధ్యతలు నిర్వహించాను. ఇప్పుడు నాకు కుర్చీ మీద వ్యామోహం లేదు. కానీ నరేష్‌ వర్గం ప్రెస్‌మీట్ పెట్టి మా పరువు బజారు కీడ్చటం బాధకలిగించింది. అందుకే నేను మీడియా ముందుకు రావాల్సి వచ్చింది. అమెరికా ఈవెంట్ సందర్భంగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు చేయటం సరికాదు. ఆ ఈవెంట్‌పై చిరంజీవి అధ్యక్షతన వేసిన కమిటీ క్లీన్‌ చీట్‌ ఇచ్చింది.
(చదవండి : ‘మా’ అధ్యక్షుడిగా నరేష్‌ విజయం)

ఫిలిం స్టార్స్‌ను బిజినెస్‌ క్లాస్‌లో తీసుకెళ్లామనటం కూడా కరెక్ట్ కాదు. గతంలో నరేష్‌ కూడా పలు తమిళ నటీనటుల సంఘం ఈవెంట్‌ కు బిజినెస్‌ క్లాస్‌లో వెళ్లి సూట్ రూమ్‌లో స్టే చేశారు. తారలకు సముచిత గౌరవం ఇవ్వటం ధర్మం అందుకే బిజినెస్‌ క్లాస్‌లో తీసుకెళ్లాం. ఇన్నేళ్లల్లో నరేష్‌ మాకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ప్రతీసారి మా అమ్మ(విజయ నిర్మల) 15 ఇస్తున్నారు అంటారు. ఆ 15 వేలతోనే మా నడుస్తుందా?

ఎన్నికల సమయంలో తప్పులు జరిగాయి. నారాయణరావు అనే వ్యక్తి అక్కడే జీవితకు ఓటేయండి అంటూ మైకులో చెప్తున్నారు. అయినా నేను ఆరోపణలు చేయలేదు. జీవితా రాజశేఖర్‌లు అన్ని పార్టీలు మారారు.. ఇప్పుడు మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ మీద పడ్డారు. శ్రీరెడ్డి, డ్రగ్స్‌ విషయంలో నేను సరిగ్గా స్పందించలేదని జీవిత గతంలో అడిగారు. కానీ శ్రీరెడ్డి విషయంలో కార్డు ఇవ్వమని కొందరు, ఇవ్వొద్దని కొందరు అన్నారు, అందుకే ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోయాం.

మా డైరీ ప్రింటింగ్ సమయంలో నరేష్‌ ఈ సారి తాను ప్రింట్ చేయిస్తానని బాధ్యత తీసుకున్నాడు. 14 లక్షలు ప్రింటింగ్‌ కోసం కలెక్ట్ అయినట్టుగా వెల్లడించారు. కానీ అకౌంట్‌లో 7 లక్షలు మాత్రమే జమ అయ్యాయి. మిగతా 7 లక్షలు ఏమయ్యాయి. ఎప్పుడు వస్తాయి. అవి జమ చేసి ప్రమాణం చేస్తే బాగుంటుంది. తప్పులు వాళ్లు చేసి అవతలి వాళ్లు వేదనకు గురి చేయటం కరెక్ట్ కాదు’ అన్నారు శివాజీ రాజా.

ఎన్నికల కొద్ది రోజుల ముందు నాగబాబు ప్రెస్‌మీట్ పెట్టి నరేష్‌ వర్గానికి మద్దుతు తెలపటంపై స్పందించిన శివాజీ రాజా ‘నాగాబాబు నేను చాలా ఏళ్లుగా మంచి స్నేహితులం.. నాగబాబు నాకు గిఫ్ట్ ఇచ్చాడు, త్వరలోనే నేను రిటర్న్‌ గిఫ్ట్ ఇస్తా’ అన్నాడు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)