amp pages | Sakshi

మంచి సందేశంతో మార్షల్‌

Published on Tue, 08/27/2019 - 00:43

‘‘అభయ్‌ కథానాయకుడిగా నటించి, నిర్మించిన చిత్రం ‘మార్షల్‌’. తన జన్మస్థలమైన గుంటూరులోనే ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ వేడుక జరపడం ఎంతో సంతోషం. ఈ సినిమా ఘన విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. అభయ్‌ అడకా, మేఘా చౌదరి జంటగా నటించిన చిత్రం ‘మార్షల్‌’. హీరో శ్రీకాంత్‌ ముఖ్య పాత్రలో నటించారు. జై రాజాసింగ్‌ దర్శకత్వం వహించారు. అభయ్‌ హీరోగా నటించి, నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 19న విడుదలకానుంది.

ఈ చిత్రం ఆడియో, టీజర్‌ని గుంటూరులో విడుదల చేశారు. అభయ్‌ అడకా మాట్లాడుతూ– ‘‘నేను పుట్టి, పెరిగిన గుంటూరులో నా తొలి చిత్రం ఆడియో ఫంక్షన్‌ను ఇంత మంది పెద్దల సమక్షంలో చేయడం ఆనందంగా ఉంది. ఇదో వైవిధ్యభరితమైన చిత్రం. సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వబోతున్నాం’’ అన్నారు. ‘‘మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది.

మా సినిమా కథ నచ్చడంతో ‘కేజీఎఫ్‌’ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవిబసురి మా సినిమాకి రీ రికార్డింగ్‌తో పాటు 2 పాటలకు స్వరాలు సమకూర్చారు’’ అని జై రాజాసింగ్‌ అన్నారు. శ్రీకాంత్, షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, మద్దాలి గిరి,  వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు అప్పిరెడ్డి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, నిర్మాత వెంకటేశ్వర రావు, మేఘనా చౌదరి, సంగీత దర్శకుడు యాదగిరి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.యం.స్వామి.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌