ఆరోసారి.. ఒకటోసారి!

Published on Tue, 01/08/2019 - 00:33

అదేంటి.. ఎవరైనా ఒకటోసారి.. రెండోసారి.. ఇలా మొదలు పెడతారు. కానీ ఆరోసారి.. ఒకటోసారి అంటున్నారేంటి? అనేగా మీ సందేహం. మరి ఆ డౌట్‌ తీరాలంటే మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. రామ్‌ హీరోగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అనే సినిమా రూపొందనుంది. పూరి జగన్నాథ్‌ టూరింగ్‌ టాకీస్, పూరి కనెక్ట్స్‌ బ్యానర్స్‌పై పూరి జగన్నాథ్, చార్మి కౌర్‌ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల చివర్లో మొదలు కానుంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

గతంలో పూరి జగన్నాథ్, మణిశర్మ కలిసి చేసిన ఐదు సినిమాలు మ్యూజికల్‌ హిట్స్‌గా నిలిచాయి. వీరి కాంబినేషన్‌లో  చివరగా ‘టెంపర్‌’ సినిమా వచ్చింది. ఆ చిత్రానికి నేపథ్య సంగీతం అందించారు మణిశర్మ. ఇప్పుడు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో ఆరోసారి వీళ్లిద్దరూ కలిసి పని చేయనున్నారు. కాగా రామ్, మణిశర్మ కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా ఇదే. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాజ్‌ తోట సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: లావణ్య.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ