amp pages | Sakshi

బుల్లితెర నటికి దర్శకుడి లైంగిక వేధింపులు

Published on Mon, 07/09/2018 - 09:27

బుల్లితెర నటిని దర్శకుడు లైంగికంగా వేధించిన ఘటన మళయాళ ఇండస్ట్రీని ఉలికిపడేలా చేసింది. ఉప్పం ములకుం సీరియల్‌ అక్కడ మోస్ట్‌ వ్యూయింగ్‌ సీరియల్‌. అందులో లీడ్‌ రోల్‌ పోషిస్తున్న నటి నిషా సారంగ్‌.. సీరియల్‌ దర్శకుడు ఆర్‌ ఉన్నికృష్ణన్‌పై లైంగిక ఆరోపణలు చేస్తున్నారు.డైరెక్టర్‌ ఉన్నికృష్ణన్‌ గత కొంత కాలంగా తనను వేధిస్తున్నాడని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఆరోపించారు.

‘బూతు మెసేజ్‌లు పంపిన భరించా. సెట్స్‌లో అందరి ముందే నన్ను వేధించేవాడు. ఈ విషయం యూనిట్‌లో ఎవరిని అడిగినా చెబుతున్నారు. ఆ తర్వాత అసభ్యంగా తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడు.  దీంతో గట్టిగా హెచ్చరించా. నా కూతురి వివాహం ఉండటంతో వ్యవహారం పెద్దది చేసుకోవటం నచ్చక గమ్మున ఉండిపోయా.  అయినా అతని తీరు మారలేదు. చివరకు ఫిర్యాదు చేయటంతో నాపై కక్ష గట్టాడు. అవార్డు పంక్షన్‌ కోసం విదేశాలకు వెళ్లొచ్చేసరికి సీరియల్‌ నుంచి నన్ను తొలగించి.. ఆ ప్లేస్‌లో వేరే వారిని తీసుకున్నాడు. ఈ విషయంపై అసోషియేషన్‌లో ఫిర్యాదు చేశా. తిరిగి నన్ను తీసుకున్నా అతని వేధింపులు మాత్రం ఆగవు. ఆ విషయం ఖచ్ఛితంగా చెప్పగలను. అతనిపై చర్యలు తీసుకునేదాకా నా పోరాటం ఆగదు’ అని నిషా చెబుతున్నారు. 

ఇప్పటికే నటి భావన వేధింపుల వ్యవహారం , దీలీప్‌ సస్పెన్షన్‌ ఎత్తివేత వ్యవహారాలు ‘అసోషియేషన్‌ ఆఫ్‌ మళయాళం మూవీ ఆర్టిస్ట్స్‌’(అమ్మ-AMMA)ను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిషా వేధింపుల వ్యవహారం వెలుగులోకి రావటంతో పలువురు ఆమెకు అండగా నిలుస్తున్నారు. మెగాస్టార్‌ మమ్ముటీతోపాటు వుమెన్‌ ఇన్‌ సినిమా కలెక్టివ్‌ సభ్యులు నిషాకు మద్ధతు ప్రకటించారు.

ఉన్నికృష్ణన్‌ సీరియస్‌.. అయితే దర్శకుడు ఉన్నికృష్ణన్‌ బదులు.. మీడియా హౌజ్‌లో పని చేసే ఉన్నికృష్ణన్‌ చెన్నంపిల్లి అనే టెక్నీషియన్‌ పేరును కొన్ని వెబ్‌సైట్లు ప్రముఖంగా ప్రకటించాయి. దీంతో ఆయన సీరియస్‌ అయ్యారు. నిషా చెబుతున్న వ్యక్తి తాను కాదని, తప్పుడు కథనాలు ప్రచురిస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు.  

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌