‘118’ నుంచి లిరికల్‌ వీడియో సాంగ్‌!

Published on Fri, 02/08/2019 - 18:47

‘పటాస్‌’ మూవీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు నందమూరి కళ్యాణ్‌ రామ్‌. ఎమ్మెల్యే, నా నువ్వేలాంటి సినిమాలు చేసినా.. ఆశించినంత ఫలితాన్నివ్వలేదు. మరోసారి సూపర్‌హిట్‌ను కొట్టేందుకు డిఫరెంట్‌ స్టోరీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ.. టీజర్‌తో బాగానే ఆకట్టుకుంది. 

ఈ మూవీలో కళ్యాణ్‌ రామ్‌ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించనున్నాడు. ఈ చిత్రంలో అర్జున్‌రెడ్డి బ్యూటీ షాలిని పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.తాజాగా ఈ సినిమాలోంచి చందమామే అంటూ సాగే లిరికల్‌ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. షాలిని పాండే, కళ్యాణ్‌ రామ్‌ల కెమిస్ట్రీ బాగుందనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. మరి ఈ చిత్రం ఏమేరకు విజయం సాధిస్తుందో వేచి చూడాలి. నివేదా థామస్‌ మరో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్‌ చంద్ర సంగీతాన్ని అందిస్తున్నారు. కేవీ గుహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మార్చిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ