amp pages | Sakshi

కాజల్‌కు 2 కోట్లు?

Published on Tue, 06/30/2015 - 22:47

నటి కాజల్ అగర్వాల్ ఇప్పుడు యమ సంతోషంగా ఉన్నారు. దానికి కారణం ఉంది. తమిళంలో యువ సూపర్‌స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘మారి’ చిత్రంలో కాజలే కథానాయిక. రంజాన్ కానుకగా ఈ నెల 17న ఆ సినిమా విడుదల కానుంది. మరోపక్క తాజాగా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘బ్రహ్మోత్సవం’లో అనుకోని విధంగా ఛాన్సొచ్చింది. తమిళ సినిమా రిలీజ్ కోసం, తెలుగు సినిమా షూటింగ్‌లో పాల్గొనడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు కాజల్ చెప్పుకొచ్చారు. ధనుష్ చాలా కూల్ అనీ, సెట్స్‌లో ఎంతో అండగా ఉంటారనీ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా, సుదీర్ఘమైన డైలాగులు ఉన్నప్పుడు ధనుష్ భలే సాయం చేసేవారట!  ఇది ఇలా ఉండగా, ఈ మధ్య కాజల్ రెండు కోట్ల రూపాయల పారితోషికం అడుగుతున్నట్లు ఒక వార్త వినిపించింది.
 
 ఆ డిమాండ్‌కు నిర్మాతలు తూగలేకపోవడం వల్లే ఆమె ఇక్కడ సినిమాల్లో కనిపించడం లేదనీ ప్రచారమైంది. కానీ, కాజల్ ఆ మాటలను కొట్టిపారేశారు. ‘‘అవన్నీ వట్టి గాలివార్తలు. నాకు తగినంత నేను అడుగుతానే తప్ప, అంత అడిగాననడం పచ్చి అబద్ధం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. హిందీతో సహా వేర్వేరు భాషల్లో నటిస్తున్నందు వల్లే ఇటీవల ఇక్కడ పెద్దగా కనిపించడం లేదన్నారు. ప్రస్తుతం రణ్‌దీప్ హుడాతో ‘దో లఫ్జోం కీ కహానీ’ సినిమా కూడా అంగీకరించిన కాజల్, ‘‘అన్నిచోట్లా ఏకకాలంలో నటించడం సాధ్యం కాదుగా! దక్షిణాదిలో కొన్ని ఛాన్స్‌లు వచ్చినా, హిందీతో సహా ముందుగా ఒప్పుకున్న సినిమాల వల్ల ఆ ఆఫర్లు అంగీకరించలేదు’’ అని చెప్పుకొచ్చారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)