amp pages | Sakshi

నా దృష్టిలో...థియేటర్ అంటే ఓ షాప్!

Published on Thu, 09/11/2014 - 23:29

 రామ్‌గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనమే. తాజాగా ఆయన  విష్ణుతో చేసిన ‘అనుక్షణం’ రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వర్మ ఏమన్నారంటే...

  మాఫియా, హారర్ కథల్ని పక్కనపెట్టి కొత్తగా సైకో కిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్నారేంటి?
 దేశంలో జరిగిన పలు సైకో హత్యలే ఈ సినిమా కథకు ప్రేరణ.     ఈ కథ తయారీ కోసం... సైకో హత్యలకు సంబంధించి పలు పుస్తకాలు చదివా. హాలీవుడ్ డాక్యుమెంటరీలు చూశా. పలు కేసుల్లో వాళ్లు హత్యలు చేసిన విధానాలను పోలీసుల సహకారంతో దగ్గరగా పరిశీలించా. ఇలాంటి స్క్రిప్ట్‌తో సినిమా చేయడం నాకిదే ప్రథమం.
 
  ఇలాంటి సినిమాల వల్ల ప్రేక్షకులకు క్రైమ్ ఎలా చేయొచ్చో నేర్పినవాళ్లు అవుతారు కదా!
 సమాజంలో జరుగుతున్న క్రైమ్‌తో పోలిస్తే... తెరపై మేం చూపించే క్రైమ్ చాలా తక్కువ. బయట జరిగే సంఘటనలే నా కథలకు ప్రేరణ.
 
  మీ ‘శివ’ సినిమా సమాజంపై ఎంత బలమైన ప్రభావం చూపిందో చెప్పాల్సిన పనిలేదనుకుంటా!
 అవన్నీ... వట్టి మాటలు. అప్పట్లో కళాశాలల్లో జరుగుతున్న సంఘటనలను బట్టే ఆ సినిమా తీశాను. నేను తెరపై కొత్తగా చూపించిందేం లేదు.
 
  కానీ బలమైన మాధ్యమమైన సినిమా ద్వారా క్రైమ్ మరింత చేరువయ్యే ప్రమాదం ఉందిగా?
 సినిమాలు చూసి నేర్చుకునేంత నీచమైన స్థితిలో జనాలు లేరని నా అభిప్రాయం.
 
  మీ నుంచి ఒక చక్కని సందేశాత్మక చిత్రాన్ని మేం ఎప్పుడు ఆశించొచ్చు?
 నా నుంచి అలాంటి సినిమాలు ఎప్పటికీ రావు. సినిమాలు జనాన్ని ఏ మాత్రం ప్రభావితం చేయవని నేను ఇంతకు ముందే చెప్పాను.
 
  ‘అనుక్షణం’కి విష్ణుని హీరోగా ఎందుకు ఎంచుకున్నట్టు?
 ఈ కథకు విష్ణు యాప్ట్. ఇప్పటివరకూ విష్ణు కామెడీ, యాక్షన్ సినిమాలే చేశాడు. అతనిలో తెలియని కోణం మరొకటుంది. దాన్ని ‘రౌడీ’ షూటింగ్ టైమ్‌లో చూశాను. పూర్తిస్థాయి సీరియస్ కేరక్టర్ తనతో చేయించాలని అప్పుడే అనుకున్నా. నేను అనుకున్నదానికంటే తను బాగా చేశాడు. అలాగే.. ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రను రేవతితో చేయించాను. ఆ పాత్రకు రేవతి లాంటి మంచి నటి చేస్తేనే కరెక్ట్. ఆ పాత్ర ప్రభావం సినిమాపై ఎంత స్థాయిలో ఉంటుందో రేపు తెరపై మీరే చూస్తారు.
 
  ఇంతకీ మీ వేలంపాట కాన్సెప్ట్ వర్కవుట్ అయ్యిందనే అనుకుంటున్నారా?
 కచ్చితంగా. సినీ నిర్మాణంలోకి వచ్చేవారికి ప్రమాదంలేని ప్రయాణం ఈ విధానం.
 
  కానీ... ఇక్కడ థియేటర్ల మాఫియా ఎక్కువైందని అందరూ అంటున్నారు కదా?
 అది తెలీని వాళ్లు అనే మాట. నాకు తెలిసిన దాని ప్రకారం అసలు ఇక్కడ మాఫియానే లేదు. నా దృష్టిలో థియేటర్ అంటే ఒక షాప్. ఆ షాప్‌లో ఏది ఎక్కువగా అమ్ముడు పోతుందో దాన్ని తీసుకొచ్చి పెడతారు. అలాగే ఏ సినిమాకైతే డబ్బులొస్తాయో, ఆ సినిమానే థియేటర్‌కి తెచ్చుకుంటారు. ఇది వ్యాపారం.     దీన్ని మాఫియా అనడం ఎంతవరకూ కరెక్ట్ చెప్పండి.
 
  ఇంతకూ మీ ‘ఐస్‌క్రీమ్’ చివరి అంకె ఏంటో చెప్పండి?
 ‘ఐస్‌క్రీమ్-2’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘ఐస్‌క్రీమ్-3’ త్వరలోనే సెట్స్‌కి వెళ్లనుంది. ఇవి సింపుల్ స్క్రిప్ట్‌తో, సింపుల్ బడ్జెట్‌తో రూపొందే సినిమాలు. ఇలాంటివి థియేటర్లలో ఒక్కరోజు ఆడినా డబ్బులొచ్చేస్తాయి. ఆ ఒక్క రోజు కూడా జనాలు ఎవరూ రానప్పుడు ‘ఐస్‌క్రీమ్’ సిరీస్ ఆగిపోతుంది.
 
 లక్ష్మీప్రసన్నపై లఘుచిత్రం
 తెల్లని పరుపుపై నిద్రిస్తున్న ఓ అమ్మాయి అందమైన పాదాలు ముద్దుముద్దుగా కనిపిస్తున్నాయి. ఇంతకీ ఆ పాదాలు ఎవరివి? అనుకుంటున్నారా! తానెవరో కాదు. మంచు లక్ష్మి. ఆమె దైనందిన జీవితంపై దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఓ లఘు చిత్రాన్ని తెరకెక్కించారు. ఆద్యంతం మంచు లక్ష్మి పాదాలపైనే ఈ లఘు చిత్రాన్ని వర్మ రూపొందించడం విశేషం. ఇందులో మోహన్‌బాబు, మంచు విష్ణు కూడా తళుక్కున మెరుస్తారు. వర్మ తెరకెక్కించిన తొలి లఘు చిత్రం ఇదే కావడం విశేషం. త్వరలోనే దీన్ని విడుదల చేయనున్నారు. దీని తర్వాత... వర్మ జీవన విధానాన్ని స్వీయ దర్శకత్వంలో ఓ లఘు చిత్రంగా రూపొందిస్తానని మంచు విష్ణు విలేకరులతో పేర్కొనడం విశేషం.
 

Videos

చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..

కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..

సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)