amp pages | Sakshi

'దానికి నువ్వే కారణం'

Published on Tue, 05/24/2016 - 13:24

ముంబై: హీరోయిన్ శ్రీదేవి నుంచి ఎంతో నేర్చుకున్నానని దర్శకురాలు గౌరి షిండే తెలిపింది. ఆమె కారణంగానే తన రెండో సినిమాలో షారూఖ్ ఖాన్ లాంటి స్టార్ హీరోతో పనిచేసే అవకాశం దక్కిందని పేర్కొంది.

'శ్రీదేవి అంటే నాకు చాలా ఇష్టం. ఆమె నుంచి ఎంతో నేర్చుకున్నాను. నాపై నాకు నమ్మకం కలిగించావు. నేను రెండో సినిమా చేయడానికి నువ్వే కారణం. థ్యాంక్యూ' అని గౌరి ట్వీట్ చేసింది. దీనికి శ్రీదేవి రిప్లై ఇచ్చింది. గౌరి రెండో సినిమా.. మొదటి సినిమాను మించి విజయం సాధించాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పింది.

గౌరి షిండే దర్శకత్వం వహించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమాలో శ్రీదేవి నటించింది. 15 ఏళ్ల పాటు తెరకు దూరమైన శ్రీదేవి 2012లో ఈ సినిమాతో బాలీవుడ్ లో రీఎంట్రీ ఇచ్చింది.