amp pages | Sakshi

నేను పర్ఫెక్ట్‌ మ్యాన్‌ను కాదు!

Published on Sun, 05/12/2019 - 18:12

తమిళసినిమా: నేను ఫర్ఫెక్ట్‌ మ్యాన్‌ను కాదు అని నటుడు ధనుష్‌ అంటున్నారు. ఏంటీ? నటుడిగా దక్షిణాదిలోనే కాకుండా, బాలీవుడ్, హాలీవుడ్‌ స్థాయికి చేరుకున్న ఈ స్టార్‌ నటుడు పర్ఫెక్ట్‌ మ్యాన్‌ను కాదంటున్నారేమిటని ఆశ్చర్య పోతున్నారా? మీరేమైనా అనుకోండి ధనుష్‌ పర్ఫెక్ట్‌ మ్యాన్‌ కాదన్న మాట వాస్తవం. సరిగ్గా 17 ఏళ్ల  క్రితం 2002, మే 17న ధనుష్‌ కథానాయకుడిగా నటించిన తొలి చిత్రం తుళ్లువదో ఇళమై తెరపైకి వచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అంతే కాదు ధనుష్‌ జీవితాన్నే మార్చేసిన చిత్రం తుళ్లువదో ఇళమై.

ఆయన సోదరుడు సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించిన చిత్రం ఇది. నటుడిగా ధనుష్‌ వయసు 17 ఏళ్లు అన్నమాట. దీంతో ఆయన అభిమానులు ఆ చిత్ర పోస్టర్లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి పండగ చేసుకుంటున్నారు. వారి అభిమానానికి స్పందించిన ధనుష్‌ ట్విట్టర్‌లో పేర్కొంటూ తుళ్లువదో ఇళమై చిత్రం విడుదలై 17 ఏళ్లు అయ్యిందన్న విషయాన్ని  నమ్మలేకపోతున్నాను. ఏమీ తెలియని చిన్న కుర్రాడిగా ఉన్న నాకు మీ గుండెల్లో చోటు ఇచ్చారు. నటుడిని అవలేనని భావించిన నన్ను ఒక స్టార్‌ను చేశారు. అంతా నిన్న జరిగినట్లు ఉంది.

 నా జయాపజయాలన్నింటిలోనూ మీరు ఉన్నారు. నిజం చెప్పాలంటే నేను పర్ఫెక్ట్‌ మ్యాన్‌నే కాదు. అయితే మీ ప్రేమాభిమానాలే నన్ను పరిపూర్ణ వ్యకిగా తీర్చిదిద్దాయి.  మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నా తొలి చిత్రం విడుదలై 17 ఏళ్లు అయ్యిందన్నది మీరు పోస్ట్‌ చేసిన పోస్టర్లు చూసి నేను మరింత ఉత్తేజం పొందాను. ఈ అభిమానం ఎల్లప్పుడు ఉండాలి. ప్రేమను వ్యాప్తి చేయండి, ప్రేమ మాత్రమే ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తుంది అని ధనుష్‌ పేర్కొన్నారు. ఈ 17 ఏళ్లలో ధనుష్‌ ఒక నటుడిగా, గాయకుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా మలచుకుని ప్రముఖ కథానాయకుడిగా రాణిస్తున్నారు. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)