amp pages | Sakshi

ప్రమోషన్‌కు నో అంటున్న రెజీనా

Published on Sun, 04/23/2017 - 02:02

నటి రెజీనాకు రెక్కలొచ్చాయా? అంటే అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఇటీవల ఈ అమ్మడు నటించిన మానగరం చిత్రం అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో రెజీనాకు అవకాశాలు వరుస కడుతున్నాయి. తెలుగులోనూ చిత్రాలు చేయడంతో నిర్మాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు టాక్‌ స్ప్రెడ్‌  అయ్యింది. ఈ జాణ తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో సరవణన్‌ ఇరుక్క భయమేన్‌ చిత్రంలో నటించింది. వేల్లన్ను వందా వెళ్లక్కారన్‌ వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రం తరువాత ఎళిల్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది.

ఉదయనిధి స్టాలిన్‌ తన రెడ్‌జెయింట్‌ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి.ఇమాన్‌ సంగీతాన్ని అందించారు. ఇందులో ఉదయనిధి పూర్తి వినోదంతో కూడిన హీరో పాత్రలో నటించారు. ఆయనతో సూరి హాస్యాన్ని పండించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంది. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని యూ సర్టిఫికెట్‌తో విడుదలకు సిద్ధం అవుతోంది. మే నెల 12న చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

 చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాలకు రావలిసిందిగా నటి రెజీనాకు కోరగా తాను తెలుగు చిత్ర షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నానని, అందువల్ల శరవణన్‌ ఇరుక్క భయమేన్‌ చిత్ర ప్రమోషన్‌కు రావడం కుదరదని ఖరాఖండీగా చెప్పేస్తోందట. దీంతో యూనిట్‌ వర్గాలు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో నటి రెజీనాపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Videos

Watch Live: రేపల్లెలో సీఎం జగన్ ప్రచార సభ

రేవంత్ రెడ్డికి అమిత్ షా వార్నింగ్

బాబు, లోకేష్ కు నోటీసులు..?

ప్రచారంలో దూసుకుపోతున్న జగన్

జార్ఖండ్ మంత్రి సన్నిహితుల ఇంట్లో డబ్బే డబ్బు

ముద్రగడ పద్మనాభం స్పెషల్ ఇంటర్వ్యూ

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విషప్రచారం..రోజా అదిరిపోయే కౌంటర్

పవన్ పై ఏపీ NRIలు కౌంటర్

చంద్రబాబుపై మధుసూధన్ రెడ్డి సెటైర్లు

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌