ఆమె... ఓ మోహం!

Published on Mon, 05/30/2016 - 00:09

‘మోహిని’ అంటే మనసును మత్తులో ముంచేసే అందమని అర్థం. కథానాయిక త్రిష అందం కూడా అంతే. దాదాపు పధ్నాలుగేళ్లగా తన అందంతో, అభినయంతో వెండితెర మోహినిగా అభిమానులను మైమరిపిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ‘మోహిని’ అనే పాత్రతో మురిపించడమే కాదు.. భయపెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారామె. పధ్నాలుగేళ్ల కెరీర్‌లో గ్లామర్ పాత్రలకే కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రలకు కూడా ఓకే చెబుతూ వచ్చారు. ఈ మధ్య అయితే కథానాయిక ప్రాధాన్యంగా సాగే చిత్రాలపై మక్కువ చూపుతున్నట్లనిపిస్తోంది.

అది కూడా హారర్ చిత్రాలు చేయడం విశేషం. ‘కళావతి’ తర్వాత ఓ హారర్ చిత్రాన్ని పూర్తి చేశారు త్రిష. ఇప్పుడు ‘మోహిని’ టైటిల్‌తో తెరకెక్కుతున్న  ఓ చిత్రంలో నటిస్తున్నారు. మాధేశ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మోహిని పాత్ర కోసం త్రిష ప్రత్యేకంగా ప్రోస్థటిక్ మేకప్ కూడా వేసుకోనున్నారట. ఈ చిత్రం షూటింగ్ మొత్తం యూకే, మెక్సికోల్లో జరుగుతుంది. మోహిని అనే అమ్మాయికి ఎదురయ్యే భయానక అనుభవాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి హాలీవుడ్ వీఎఫ్‌ఎక్స్ సాంకేతిక నిపుణులు పనిచేయనున్నారట.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ