amp pages | Sakshi

హీరోగా అవకాశాలు వచ్చినా...

Published on Mon, 10/05/2015 - 14:42

ఆయన పేరు జానీలీవర్. ప్రముఖ హిందీ కమెడియన్. తన నటనతో, కామెడీ షోలతో ప్రేక్షకులను, అభిమానులను కడుపుబ్బ నవ్వించడంలో ఆయనకు ఆయనే సాటి. ఎంత ఎదిగినా అమ్మభాషను, జన్మస్థలిని మరువకూడదనే గొప్ప సంస్కారం. స్థానిక సంఘమిత్ర ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న తన వదిన లక్ష్మిని పరామర్శించేందుకు సతీమణి సుజాతతో కలసి ఒంగోలు వచ్చిన ఆయన ఆదివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

మీ బాల్యం గురించి..
నా స్వస్థలం ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం ఉసుళ్లపల్లి. నా తల్లిదండ్రులు జనమాల ప్రకాశరావు, కరుణమ్మ. మా నాన్నగారు బతుకుదెరువు కోసం కుటుంబంతో ముంబై చేరుకున్నారు. అక్కడే నేను జన్మించాను. మా నాన్నగారు హిందుస్థాన్ లీవర్  కంపెనీలో 30 ఏళ్లు పనిచేశారు. నేను కూడా ఆరేళ్లు 1976నుంచి 81దాకా ఆ కంపెనీలో ఉద్యోగం చేశాను. అందుకే నా పేరులో లీవర్ కలసి జానీలీవర్ అనే పేరు వచ్చింది. పదో ఏట డ్యాన్స్, 17వ ఏట మిమిక్రీ చేయడం ప్రారంభించాను. పలు నాటకాలలో నటించాను. రెండున్నర గంటల పాటు నేను ఒక్కడినే స్టేజి షోలు ఇస్తున్నాను.

సినీరంగంలోకి ఎలా వచ్చానంటే..
1980లో సినిమా రంగ ప్రవేశం జరిగింది. ‘ఏ రిస్తా నాటూటే’ (ఈ బంధం తెగదు) అనేది నా తొలి సినిమా. తెలుగువారైన పింజలి సుబ్బారావు ఆ చిత్ర నిర్మాత. తరువాత 400కుపైగా హిందీ సినిమాలలో నటించా. మరాఠీ, గుజరాతీ, రాజస్థానీ చిత్రాలలో నటించా. 1992లో వచ్చిన ‘బాజీగర్’వంటి పలు చిత్రాలు కమెడియన్‌గా నాకు మంచి పేరు తెచ్చాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతున్న ‘దిల్వాల్’ చిత్రంలో నటిస్తున్నాను.

తెలుగులో ఒక్క సినిమానే...
తెలుగులో నేను నటించిన ఒకే ఒక్క చిత్రం క్రిమినల్. అవకాశాలు వచ్చినప్పటికీ  హిందీ సినిమాలు, కామెడీ షోలు, విదేశాలలో ప్రోగ్రాంలు వంటి వాటితో తీరిక లేకపోవడంతో తెలుగు సినిమాలు చేసే అవకాశం కలగ లేదు. పైగా ఇక్కడ మంచి కమెడియన్లు ఉన్నారు. కొన్ని సందర్భాలలో హీరోగా అవకాశాలు వచ్చినా తీరుబడి లేక చేయలేకపోతున్నాను.

పేద కళాకారులను ఆదుకుంటున్నా..
నాకు ఇండస్ట్రీ అన్నీ ఇచ్చింది. అలాగే ఇండస్ట్రీకి కూడా నేను సాయ పడుతున్నాను. పేద కళాకారులను ఆదుకునేందుకు కృషి చేస్తున్నాను. ఆర్టిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించిన కాలంలో  వారి సంక్షేమానికి చర్యలు చేపట్టాం. పెన్షన్ ఇప్పించడంతోపాటు వైద్య సేవలు అందించాం. అసోసియేషన్ కోసం భవనం కూడా నిర్మించాం.

వినోదానికీ పరిమితి ఉంది..
నేడు వినోద ప్రధానమైన ప్రదర్శనలను, కార్యక్రమాలను అనుకరించే వాళ్లు పెరిగారు. దీనివల్ల ఒక్కోసారి అనర్ధాలు సంభవిస్తున్నాయి. వినోదాన్ని ఆస్వాదించ వచ్చు కానీ జీవితంలోకి దానిని ఆహ్వానించాలని ప్రయత్నిస్తే కొన్ని సందర్భాలలో ప్రమాదాలు తప్పక పోవచ్చు. దేనికైనా ఒక పరిమితి ఉండాలి.

బాధ్యత గుర్తెరగాలి..
జీవితంలో సత్యాన్ని, ధర్మాన్ని తప్పక అనుసరించాలి. అప్పుడే క్షేమంగా ఉండగలుగుతాం. బాధ్యత గుర్తెరిగి ప్రవర్తించడం సర్వదా శ్రేయస్కరం.

కళను ఆదరించండి..
ఏ కళకైనా ప్రజలే పోషకులు. వారి ఆదరణపైనే మాలాంటి ఆర్టిస్టులు ఆధారపడి ఉన్నారు. కళను అర్థం చేసుకుని ఆదరించాలి.

ముందు కుటుంబాన్ని చక్కదిద్దుకోండి..
కుటుంబాన్ని తీర్చిదిద్దుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలి. కుటుంబాన్ని తీర్చిదిద్దుకున్న తరువాతే సమాజం, ప్రపంచం గురించి పట్టించుకుంటే బాగుంటుంది. లేకుంటే కుటుంబ జీవితంలో సమస్యలు తప్పవు.

పిల్లలు ప్రయోజకులవుతున్నారు..
మా అబ్బాయి జెస్సీ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నాడు. చక్కగా పాటలు పాడుతాడు. కామెడీ హీరోగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాను. ఇక మా అమ్మాయి జామీ‘ కిస్‌కిస్ రోస్సార్ కరో’వంటి సినిమాలో నటించింది.                       

- ఒంగోలు కల్చరల్

Videos

కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం

సంక్షేమ పథకాలతో జనం సంతోషంగా ఉన్నారు: విజయానంద్ రెడ్డి

చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్

మోదీని ఢీకొట్టే సత్తా సీఎం జగన్ కే ఉంది

వీడియో చూపించి షర్మిల బండారం బయటపెట్టిన పొన్నవోలు

పెమ్మసాని...కాసుల కహానీ

కూటమి మేనిఫెస్టోపై రాచమల్లు కామెంట్స్

మోదీ ఫోటో లేకుండా చంద్రబాబు 420 మేనిఫెస్టో..

చంద్రబాబుది బోగస్ రిపోర్ట్..

అన్నావదినపై విషం కక్కుతారా..

పింఛన్ దారులకు పెన్షన్ కానుక పంపిణీ..

షర్మిల ఆడియో లీక్

అభివృద్ధి ఎంత జరిగిందో ప్రజల్లో ఉంటే తెలుస్తుంది బుగ్గన అర్జున్ రెడ్డి కామెంట్స్

హామీలు కాదు..చెవిలో పువ్వులు..టీడీపీ మేనిఫెస్టో చూసి మోదీ షాక్

Watch Live: పాయకరావుపేటలో సీఎం జగన్ ప్రచార సభ

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన పాలన ఉంది

వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం..హారతులతో స్వాగతం పలికిన మహిళలు

మాటలు చెప్పే ప్రభుత్వం కాదు...చేసి చూపించే ప్రభుత్వం..

కూటమి మేనిఫెస్టో పై ఉష శ్రీ చరణ్ సంచలన వ్యాఖ్యలు..

కూటమి మేనిఫెస్టో పై కొమ్మినేని కామెంట్స్

Photos

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)