amp pages | Sakshi

విపత్తు ఏంటి?

Published on Sun, 09/30/2018 - 03:50

చైతన్యరామ్, పవన్‌ కుమార్‌ హీరోలుగా, రాధిక హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘గండభేరుండ’. సూర్యన్‌ దర్శకత్వంలో కె.సూరిబాబు, చల్లమళ్ల రామకృష్ణ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్‌ 5న  విడుదల కానుంది. శ్రీసాయిదేవ్‌ స్వరపరచిన ఈ సినిమా పాటలను, ట్రైలర్‌ని దర్శక–నిర్మాత సాయివెంకట్, ఏపీ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సెక్రటరీ జె.వి.మోహన్‌ గౌడ్‌ హైదరాబాద్‌లో విడుదల చేశారు. ‘గండభేరుండ’ సినిమా మంచి విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.

సూర్యన్‌ మాట్లాడుతూ– ‘‘గండభేరుండ’ అనే పక్షి మనిషిగా పుట్టి ఓ కుటుంబాన్ని అత్యంత ప్రమాదకర విపత్తు నుంచి ఎలా కాపాడిందనే కథాంశంతో రూపొందిన సోషియో ఫ్యాంటసీ హారర్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. మలేసియాలో చేయించిన 17 నిమిషాల నిడివి గల గ్రాఫిక్స్, 5 ఫైట్స్, 4 పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం, పెద్దాపురం, భీమోలు పరిసర ప్రాంతాల్లో సినిమా మొత్తం చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘సెన్సార్‌ సహా అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. అక్టోబర్‌ 5న విడుదల కానున్న మా సినిమా ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు చల్లమళ్ల రామకృష్ణ. రాధిక, పవన్‌ కుమార్, విలన్‌ పాత్రధారి రవికిరణ్‌ శొంఠి, డైరెక్టర్‌ సుచరిత తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి  కెమెరా: ఆనంద్‌.

Videos

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)