amp pages | Sakshi

ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ ప్రారంభం

Published on Sun, 06/24/2018 - 01:18

ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ మొదలైంది. శనివారం హైదరాబాద్‌లో సందడి సందడిగా స్టార్ట్‌ అయింది. వైవిధ్యమైన చిత్రాలతో జోరు మీదున్న వెంకటేశ్,   ఫిదా, తొలి ప్రేమ సినిమాల విజయాలతో మంచి ఊపు మీదున్న వరుణ్‌ తేజ్‌ ఈ ఎఫ్‌ అండ్‌ ఎఫ్‌కి హీరోలు. ‘దిల్‌’ రాజు నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్‌ 2’. ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌ అనేది చిత్రానికి ఉపశీర్షిక. హ్యాట్రిక్‌ విజయాలను తన ఖాతాలో వేసుకున్న అనిల్‌ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లోని సంస్థ కార్యాలయంలో జరిగింది.

తొలి సన్నివేశంలో పాల్గొన్న ఇద్దరు హీరోలు వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌లపై నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ ఇచ్చారు. అనంతరం అల్లు అరవింద్, ‘దిల్‌’ రాజు, శిరీష్, వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ అందరూ కలిసి సినిమా స్క్రిప్ట్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడికి అందించారు.  జూలై 5న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. తమన్నా, మెహరీన్‌లు కథానాయికలుగా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలను సమకూరుస్తారు. సమీర్‌రెడ్డి ఫొటోగ్రఫీని అందిస్తున్నారు.
ఈ ప్రారంభోత్సవంలో శిరీష్, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌