నలుగురమ్మాయిల కథ

Published on Tue, 01/22/2019 - 03:38

బ్లాక్‌ అండ్‌ వైట్‌ పిక్చర్స్‌ పతాకంపై తొలి ప్రయత్నంగా హిమబిందు వెలగపూడి నిర్మిస్తున్న చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సినీ మీడియా రంగంలో రిపోర్టర్‌గా పని చేసిన బాలు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలు మాట్లాడుతూ– ‘‘స్వతంత్ర భావాలున్న నలుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. త్రిదా చౌదరి, ధన్యా బాలకృష్ణ. సిద్ధీ ఇద్నాని, కోమలీ ప్రసాద్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే ఈ సినిమాలో కథానుగుణంగా ఉండే ట్విస్ట్‌లు ప్రేక్షకులనుఆకట్టుకుంటాయి’’ అన్నారు. ‘‘ఈ రోజు నుండి తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతుంది. తదుపరి షెడ్యూల్‌ను గోవాలో ఫిబ్రవరిలో ప్రారంభిస్తాం. మేలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు హిమబిందు. ఈ చిత్రానికి సంగీతం: రఘు కుంచె, సహనిర్మాతలు: రాధికా శ్రీనివాస్‌ వెత్షా, ఉమా కూచిపూడి.
 

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ