ఫ్యామిలీ మొత్తం చూడాలనుకుంటాను

Published on Sun, 05/20/2018 - 00:34

‘‘నేల టిక్కెట్టు’ టైటిల్‌ అని పెట్టినప్పటికీ సినిమా మాత్రం అన్ని సెక్షన్‌ ఆడియన్స్‌కు తప్పకుండా నచ్చుతుంది. బాల్కనీ ఆడియన్స్‌ లాజిక్స్‌ పట్టించుకుంటారు. ఈ సీన్‌ ఇలా కాకుండా అలా తీసుంటే బావుండు అనే విషయాన్ని ఆలోచిస్తారు. కానీ నేల టిక్కెట్టు ఆడియన్స్‌ మాత్రం ఇవేమీ ఆలోచించకుండా మూవీను ఎంజాయ్‌ చేస్తారు. హైదరాబాద్‌ వచ్చిన కొత్తలో ఒక్కో సినిమాను రెండుసార్లు చూసేవాణ్ణి. బాల్కనీలో ఒకసారి, నేల టిక్కెట్టులో ఒకసారి’’ అన్నారు కల్యాణ్‌కృష్ణ కురసాల. రవితేజ, మాళవికా శర్మ జంటగా కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నేల టిక్కెట్టు’. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా కల్యాణ్‌ కృష్ణ విలేకరులతో పలు విశేషాలు  పంచుకున్నారు.

► మాస్‌ ఎలిమెంట్స్‌ ఉన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘నేల టిక్కెట్టు’. రవితేజ సినిమా అంటే ఆడియన్స్‌ కచ్చితంగా కామెడీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తారు. ఈ సినిమాలోనూ 70 శాతం కామెడీ ఉంటుంది. ఆవారాగా తిరిగే కుర్రాడిగా రవితేజ క్యారెక్టర్‌ ఉంటుంది. అతని క్యారెక్టర్‌కు రెండు షేడ్స్‌ ఉంటాయి. కామెడీ యాంగిల్‌ ఒకటి. ఫైర్‌ యాంగిల్‌ మరోటి. చుట్టూ జనం, మధ్యలో మనం ఉండాలి అనే మనస్తత్వం ఉన్న క్యారెక్టర్‌ అతనిది.

► రామ్‌ తాళ్లూరిగారికి ప్రొడక్షన్‌ ఫస్ట్‌ టైమ్‌ అయినా ఎక్కడా అలా అనిపించలేదు. చాలా అనుభవం ఉన్నవారిలా హ్యాండిల్‌ చేశారు. రవితేజగారి స్పీడ్, ప్రొడక్షన్‌ వాళ్ల సహకారం వల్ల పెద్ద క్యాస్టింగ్‌ ఉన్న సినిమాను కూడా అనుకున్న టైమ్‌కు కంప్లీట్‌  చేయగలిగాం.

► మాళవికా శర్మ మంచి క్యారెక్టర్‌ ప్లే చేశారు. శక్తికాంత్‌ కార్తీక్‌ క్వాలిటీ మ్యూజిక్‌ ఇచ్చాడు. ఈ సినిమా వర్కింగ్‌ ప్రాసెస్‌లో రవితేజ గారి దగ్గర సిన్సియారిటీ నేర్చుకున్నాను. పని పట్ల ఆయనకు ఉన్న రెస్పెక్ట్‌ చాలా గ్రేట్‌. ఇవాళ ఏదైనా పని చేయాలనుకుంటే ఆ పనిని కచ్చితంగా ఆ రోజే కంప్లీట్‌ చేస్తారు. స్క్రీన్‌ మీద ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటారో బయట కూడా అలానే ఉంటారు. .

► ఫ్యామిలీ అందరూ కలిసి చూసే సినిమాలను ఎక్కువగా ఇష్టపడతాను. అలాంటి సినిమాలే తీయడానికి ఇష్టపడతాను. ‘రంగస్థలం’, మహానటి’ సినిమాలు ప్రయోగాలు కాదు. రియలిస్టిక్‌గా, కన్విక్షన్‌తో చెప్పిన పాయింట్స్‌.

► ఎక్స్‌పెరిమెంట్స్‌ కాకుండా కన్విక్షన్‌తో కథ చెప్పాలనుకుంటాను.

► సీనియర్‌ సిటిజన్స్‌కి చాలామంది రెస్పెక్ట్‌ ఇవ్వరు. ఆ విషయాన్ని ఈ సినిమాలో ఒక సీక్వెన్స్‌గా చూపించాను. వాళ్లను రెస్పెక్ట్‌ చేయాలి. నిలువెత్తు అనుభవం అనే డైలాగ్‌ కూడా రాసుకున్నా.

► తర్వాతి ప్రాజెక్ట్‌ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ప్రీక్వెల్‌  ‘బంగార్రాజు’ అనుకుంటున్నాను. స్టోరీ కంప్లీట్‌ అవ్వగానే నాగార్జునగారిని కలుస్తాను. జులై, ఆగస్టులో  మొదలుపెడదాం అనే ఆలోచనలో ఉన్నాను’’ అని పేర్కొన్నారు.

Videos

స్టేజ్ పై బాబు, పవన్ పరువు పాయె..!

టీడీపీ, జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..

ముస్లిం రిజర్వేషన్లపై.. పీఎం మోడీ కీలక వ్యాఖ్యలు

చంద్రబాబు మేనిఫెస్టో మాయలు

టీడీపీ మేనిఫెస్టోలో మోదీ ఫొటో వద్దని బీజేపీ తేల్చేసింది..!

చిరంజీవి పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయిన కేఏ పాల్

చంద్రబాబును ఉతికారేసిన జగన్

ఈ రెండు ఉదాహరణలు గుర్తుంచుకోండి..!

కుండబద్దలు కొట్టిన బీజేపీ.. టీడీపీ మేనిఫెస్టోకు దూరం

మైదుకూరులో జనసునామి

షర్మిల బండారం బయటపెట్టిన కాంగ్రెస్ నేత

టీడీపీ నుండి YSRCPలోకి 500 కుటుంబాలు

చంద్రన్న కాంగ్రెస్ కు సీఎం జగన్ కౌంటర్..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కలికిరి (అన్నమయ్య జిల్లా)

జనసేన నాయకురాలిపై.. చింతమనేని ఆగ్రహం

చంద్రన్న కాంగ్రెస్ సీఎం జగన్ మాస్ స్పీచ్

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

Photos

+5

జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

10 లక్షల 1116 సార్లు గోవింద నామాలు (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

కన్నడ బ్యూటీ 'నందిత శ్వేత' పుట్టినరోజు స్పెషల్‌ ఫోటోలు

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

HBD Rohit Sharma: హిట్‌మ్యాన్‌ కుటుంబం గురించి తెలుసా? బ్యాగ్రౌండ్‌ ఇదే!

+5

మత్తెక్కించే ప్రజ్ఞా నగ్రా అందం.. చూపులతోనే కుర్రకారు గుండెల్లో చిచ్చు! (ఫొటోలు)

+5

చీరకట్టులో తమన్నా.. మిల్కీ బ్యూటీ స్పెషల్ ట్రీట్ (ఫొటోలు)