amp pages | Sakshi

నా సంతోషంకోసమే !

Published on Sat, 04/07/2018 - 04:29

తమిళసినిమా: నటీనటులే కాదు, ఏ శాఖకు చెందిన వారికైనా టర్నింగ్‌ పాయింట్‌ అనేది ఒకటుంటుంది.అలా నటి సాయిపల్లవి కెరీర్‌కు మలయాళం చిత్రం ప్రేమమ్‌ పెద్ద టర్నింగ్‌గా మారింది. అప్పటి వరకూ చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ వైద్య విద్య చదుకుకుంటున్న ఈ అమ్మడికి అనూహ్యంగా వరించిన అవకాశమే ప్రేమమ్‌. ఆ చిత్ర విజయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇతర నటీమణుల కంటే  సాయిపల్లవి కాస్త భిన్నమనే చెప్పాలి. డాక్టర్‌ అవ్వాలనుకుని యాక్టర్‌ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు దక్షిణాది క్రేజీ హీరోయిన్‌గా మారింది.

అయితే ఈ అమ్మడికి కాస్త టెక్కు అనే ప్రచారం బాగా జరుగుతోంది. చాలా షరతులు విధిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. క్రమశిక్షణను పాటించదని షూటింగ్‌లకు చెప్పిన టైమ్‌కు రాదని ఆరోపణలను ఎదుర్కొంటున్న సాయిపల్లవి విధించే మరో నిబంధన గ్లామర్‌గా నటించనన్నది. సహ నటీమణులందరూ గ్లామర్‌కుసై అంటుంటే నువ్వెందుకు మడికట్టుకుని ఉన్నావన్న ప్రశ్నకు ఎందుకంటే తన తల్లిదండ్రులు తన సంతోషం కోసమే నటించడానికి అనుమతించారని, అలాంటి వారి మనసు నొచ్చుకునేలా ఎలాంటి పని తాను చేయనని బదులిచ్చింది.

గ్లామర్‌గా నటించకపోవడానికి కూడా అదే కారణం అని పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మలయాళ చిత్రం ప్రేమమ్‌ తరువాత కోలీవుడ్‌లో మణిరత్నం లాంటి దర్శకుడి అవకాశాన్నే కాలదన్నుకుందన్నుకున్నా ఈ జాణకు చేతి నిండా చిత్రాలుండడం విశేషమే. తమిళంలో ఇప్పటికి ఒక్క చిత్రం తెరపైకి రాకపోయినా మూడు చిత్రాల్లో నటించేస్తోంది. అందులో విజయ్‌ దర్శకత్వంలో నటించిన కరు చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇక సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో సూర్యకు జంటగా ఎన్‌జీకే, ధనుష్‌ సరసన మరి–2 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. వీటితో పాటు తెలుగులోనూ నటిస్తోంది. దీంతో తాజాగా శివకార్తికేయన్‌తో జతకట్టే అవకాశం తలుపు తట్టగా కాల్‌షీట్స్‌ సమస్య తలెత్తడంతో సారీ అని చేతులెత్తేసింది. ఇప్పుడా అవకాశం నయనతారను వెతుక్కుంటూ వెళ్లింది. ఆ అగ్రనటి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇంతకు ముందు శివకార్తికేయన్, నయనతార నటించిన వేలైక్కారన్‌ చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Videos

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)