amp pages | Sakshi

బిగ్‌బాస్‌.. వైరల్‌ అవుతున్న ముద్దు సన్నివేశం

Published on Tue, 09/17/2019 - 08:34

బిగ్‌బాస్‌ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్‌లో ఇంటి సభ్యుల త్యాగాలన్నీ ఒకెత్తు అయితే పునర్నవి రాహుల్‌ను హగ్‌ చేసుకోవడం, ముద్దు పెట్టుకోవడం మరో ఎత్తు. ఇక ఈ సీన్‌పై సోషల్‌ మీడియాలో లెక్కలేనన్ని మీమ్స్‌, కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. ముఖ్యంగా రాహుల్‌ సత్తాపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఏ టాస్క్‌ చేయలేడని, మాటలు తప్పా చేతలు చేయలేడని అన్న వారికి గట్టి సమాధానం ఇచ్చాడని అతని అభిమానులు కాలర్‌ ఎగేరుస్తున్నారు.
(రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న పునర్నవి)

రాహుల్.. ఇంత వరకు ఏ టాస్క్‌లోనూ సరిగా ఆడలేదని ఇంటాబయట అందరూ కామెంట్లు చేసేవారు. మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లోనూ రాహుల్‌పై పునర్నవి కామెంట్లు చేసింది. వితికాను ఎత్తుకుని పరిగెత్తే విషయమై.. వారంతా చర్చించుకుంటూ ఉంటే.. చేయి నొప్పి, కాలు నొప్పి అంటావ్‌ టాస్క్‌ నీకవసరమా? అంటూ రాహుల్‌నుద్దేశించి పునర్నవి పేర్కొంది. దీంతో వారిద్దరి మధ్య దూరం పెరిగింది. వీకెండ్‌ ఎపిసోడ్‌లో ఇది ఇంకాస్త పెరిగింది. ఇక ఫ్రెండ్‌షిప్‌ బ్రేకప్‌ అంటూ పున్ను చెప్పిన సంగతి తెలిసిందే.

ఇక పునర్నవిని ఎలా రీచార్జ్‌ చేయాలో తెలియని రాహుల్‌ను.. బిగ్‌బాస్‌ దగ్గరుండి మరి చేయించాడంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. వారిద్దరు అలా దూరంగా ఉంటే పుటేజ్‌ దొరకడం లేదని.. ఇద్దర్నీ కలిపేందుకు అలాంటి టాస్క్‌ ఇచ్చాడని నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. తన కోసం ఇరమై గ్లాసుల కాకరకాయ జ్యూస్‌ను తాగగలడా? అని అనుమానం వ్యక్తం చేసిన పునర్నవికి.. విజయవంతంగా తాగి చూపించాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మొదట కాస్త కష్టంగానే అనిపించినా.. ఆ టాస్క్‌ను రాహుల్‌ మొత్తానికి పూర్తి చేసేశాడు. దీంతో పునర్నవికి ఎక్కడ లేని ఆనందం వచ్చేసింది. అంతుపట్టని సంతోషంతో.. రాహుల్‌ను హగ్‌ చేసుకుని, ముద్దు పెట్టింది. ఇక ఇదే నెటిజన్ల దొరికిన పాయింట్‌. పునర్నవి ముద్దు పెట్టిన సీన్‌పై సోషల్‌మీడియాలో వందలకొద్ది మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. మొత్తానికి నిన్నటి ఆ టాస్క్‌, ఆ సీన్‌తో రాహుల్‌ సోషల్‌ మీడియాలో హీరో అయ్యాడు. అయితే దీనిపై పున్ను ఫ్యాన్స్‌ కాస్త అసహనానికి లోనైట్టు కనిపిస్తోంది. వారి అసంతృప్తిని మీమ్స్‌ రూపంలో ప్రదర్శిస్తున్నారు. వీరిద్దరిపై సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని మీమ్స్‌ను మీరూ చూసేయండి.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)