amp pages | Sakshi

తెలుగులో ఆ చిన్న మార్పు రావాలి

Published on Sat, 12/30/2017 - 01:20

‘‘మళ్లీ తెలుగులో కనిపించటం సంతోషంగా ఉంది. ‘ఎంసీఏ’లో నాది చాలా స్ట్రాంగ్‌ రోల్‌. తక్కువగా మాట్లాడినా పవర్‌ఫుల్‌గా ఉంటుంది.  చాలా మంచి రెస్పాన్స్‌ వస్తోంది. నా దృష్టిలో ఏదైనా యాక్టింగే. వదిన పాత్ర చేయడానికి రిఫరెన్స్‌ ఏం తీసుకోలేదు. ఫ్రెండ్స్‌ని చూసి ఇన్‌స్పైర్‌ అవుతుంటా’’ అన్నారు భూమిక. నాని, సాయి పల్లవి జంటగా శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో ‘దిల్‌’  రాజు, శిరీష్, లక్ష్మణ్‌ నిర్మించిన ‘ఎంసీఏ’ ఈ నెల 21న విడుదలైంది. ఇందులో నాని వదినగా నటించిన భూమిక విలేకర్ల సమావేశంలో పలు విశేషాలు పంచుకున్నారు.

► నాని చాలా కంఫర్టబుల్‌ యాక్టర్‌. ఎక్సలెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇస్తాడు. కెమెరా ఆన్‌ అయితే చాలు టక్కున మారిపోతాడు. వరుస హిట్స్‌ వచ్చినా కూడా వెరీ డౌన్‌ టూ ఎర్త్‌. ‘దిల్‌’ రాజుగారు చాలా కూల్‌. అన్నింటినీ బాగా చూసుకుంటారు. బెస్ట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌. నన్నో ఫ్యామిలీ మెంబర్‌లా చూసుకున్నారు.

► హాలీవుడ్, బాలీవుడ్‌ లాగా తెలుగులో చిన్న మార్పు రావాలి. విద్యాబాలన్‌ ‘తుమ్హారీ సులూ’ సినిమాలో పెళ్లయి, ఒక కొడుకు ఉన్న పాత్ర చేశారు. ఆ సినిమాలో చీరలే కట్టారు. గ్లామరస్‌గా ఏమీ ఉండరు. ఆరోగ్యంగా ఉంటారు. అందులో ఆమే మొయిన్‌ క్యారెక్టర్‌. అలాంటి చేంజ్‌ మన దగ్గర కూడా రావాలి. పెళ్లయితే చాలు... ఓన్లీ క్యారెక్టర్‌ రోల్స్‌ అని ఇక్కడివాళ్లు ఫిక్స్‌ అయిపోయారు.

► నా కజిన్‌ సిస్టర్‌ నాతో ట్రావెల్‌ చేస్తుంటారు. ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్‌ ఉంది. అందుకే బాబు (యష్‌) గురించి నాకు దిగులు లేదు. మళ్లీ సినిమాలు నిర్మించే తీరిక లేదు. మా బాబుతో సరిపోతోంది. యష్‌ నర్సరీ చదువుతున్నాడు. నాకేదైనా షూటింగ్‌ ఉందంటే వాడు స్కూల్‌ ఎగ్గొట్టాలి. వాడు స్కూల్‌ ఎగ్గొట్టేంత విలువైన పాత్రలే చేయాలనుకుంటున్నాను (నవ్వుతూ). ‘సవ్యసాచి’లో నాగచైతన్య సిస్టర్‌ రోల్‌ చేస్తున్నాను. చాలా చిన్న పాత్ర అది. కానీ కథను ముందుకు తీసుకు వెళ్లే పాత్ర. ఎంత సేపు కనిపించాం అన్నది కాకుండా ఎంత మంచి రోల్‌ చేశాం అన్నది నాకు ముఖ్యం.

► నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకోవాలని ఉండేది. గ్రామర్‌ అంటేనే కొంచెం కష్టం. అందుకే ట్రై చేయలేదు. ‘ఎంసీఏ’లో చెప్పుకుందామనుకున్నా. కానీ కుదర్లేదు. ‘సవ్యసాచి’కి కచ్చితంగా ట్రై చేస్తా.

► ప్రస్తుతం హిందీలో ప్రభుదేవా, తమన్నా నటిస్తోన్న ‘కామోషి’లో మంచి రోల్‌ చేస్తున్నా. ఇది మార్చిలో రిలీజవుతుంది. తమిళంలో ‘కళియుగ కాలం’ అనే సినిమాలో నయనతార, నేను లీడ్‌ రోల్స్‌ చేస్తున్నాం.

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)