amp pages | Sakshi

బాలయ్య అభిమానులకు మరో సర్‌ప్రైజ్‌ గిప్ట్‌

Published on Sat, 11/09/2019 - 15:43

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రూలర్’. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక​ ఈ సినిమాలో బాలయ్య స్టైలీష్‌ లుక్‌లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకోగా.. దీపావళి సందర్భంగా రిలీజ్‌ అయిన చిత్ర పోస్టర్‌ అభిమానులను అలరిస్తోంది. తాజాగా బాలయ్య అభిమానులను మరోసారి సర్‌ప్రైజ్‌ చేసింది చిత్ర యూనిట్‌. ‘రూలర్‌’లో బాలయ్యకు సంబంధించిన మరో లుక్‌ను విడుదల చేసింది. అంతేకాకుండా టీజర్‌ వెరీ సూన్‌ అంటూ పేర్కొంది. 

ఇక తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో బాలయ్య స్టెప్పులేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక డిఫరెంట్‌ కాస్ట్యూమ్స్‌తో పాటు అతడు వేసుకున్న షూస్‌ ట్రెండీగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా కోసం బాలయ్య తన రూపం, ఆహార్యం పూర్తిగా మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ చివర దశకు చేరడంతో సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించారు. దీనిలో భాగంగా ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు ‘రూలర్‌’ చిత్ర యూనిట్‌. ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ ,భూమిక కీలక పాత్రలు పోషించారు. రూలర్‌ సినిమా క్రిస్మస్‌ కానుకగా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇక ‘ఎన్టీఆర్‌’కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు నిరాశపర్చడంతో పాటు ఎన్నికలు రావడంతో బాలయ్య సినిమాలకు కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. దీంతో లాంగ్య్‌ గ్యాప్‌ తర్వాత కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో వస్తున్న ‘రూలర్‌’పై నందమూరి అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ సినిమా పూర్తైన తరువాత బోయపాటి శ్రీనుతో సినిమా చేయబోతున్నాడు. సినిమా కథ ఇప్పటికే పూర్తయింది.  స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయినట్టు సమాచారం.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌