amp pages | Sakshi

అక్టోబర్ అంతా... బాహుబలి సందడే!

Published on Sat, 10/01/2016 - 00:59

‘‘ఈ నెల 5న ప్రభాస్ అభిమానులందరికీ ఓ శుభవార్త. (నవ్వుతూ..) శుభవార్త అంటే ప్రభాస్ పెళ్లి కాదండీ. ‘బాహుబలి2’ విడుదలైతే గానీ పెళ్ళి చేసుకోనని తనే చెప్పాడు. దక్షిణాది ప్రేక్షకులందరూ గర్వించే వార్త చెబుతాం’’ అన్నారు దర్శకుడు రాజమౌళి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ ముఖ్యతారలుగా రాజమౌళి దర్శకత్వంలో శోభూ యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్న సినిమా ‘బాహుబలి-2: ద కన్‌క్లూజన్’. శుక్రవారం ఈ సినిమా లోగోను ‘బాహుబలి’ టీమ్ విడుదల చేసింది. వచ్చే ఏప్రిల్ 28న సినిమా రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
 
 అభిమానుల కోసం ఒక రోజు ముందే...!
 ఈ అక్టోబర్ నెల మొత్తం ‘బాహుబలి’కి సంబంధించిన రకరకాల అంశాలు జనం ముందుకు రానున్నట్లు రాజమౌళి బృందం వివరించింది. దగ్గుబాటి రానా మాట్లాడుతూ - ‘‘రాజమౌళి ఓ మహావృక్షాన్ని సృష్టిస్తే.. అందులో ‘బాహుబలి’ సినిమా ఓ కొమ్మ మాత్రమే. టీవీ సిరీస్, కామిక్ బుక్స్, వర్చ్యువల్ రియాలిటీ, మర్చండైజింగ్ (వివిధ రకాల ‘బాహుబలి’ వాణిజ్య ఉత్పత్తుల విక్రయం)- లాంటివన్నీ అనేక ఇతర కొమ్మలు’’ అన్నారు. ‘బాహుబలి’ కామిక్ బుక్స్, వర్చ్యువల్ రియాలిటీ (వీఆర్) ఎక్స్‌పీరియన్స్ గురించి రాజమౌళి వివరించారు.
 
  ‘‘ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. దానికి ఒక్కరోజు ముందే, అంటే 22న ‘బాహుబలి-2’ సినిమా ఫస్ట్ లుక్, ‘బాహుబలి’ కామిక్ బుక్ సిరీస్‌లో మొదటిది విడుదల చేస్తున్నాం. ఇక, పుట్టినరోజు నాడు వర్చ్యువల్ రియాలిటీలో సినిమా మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తాం’’ అని రాజమౌళి వివరించారు. అలాగే, అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే ‘బాహుబలి’ 2డీ యానిమేషన్ కార్టూన్ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను శనివారం రిలీజ్ చేయనున్నారు.
 
 మధ్యలో మరో సినిమా చేయాలనుకున్నా! - ప్రభాస్
 ప్రభాస్ మాట్లాడుతూ - ‘‘ ‘బాహుబలి1’ విడుదల తర్వాత 3-4 నెలలు గ్యాప్ వచ్చింది. మధ్యలో ఓ సినిమా చేయాలని ప్లాన్ కూడా చేశా. కానీ, మహా సముద్రం (బాహుబలి) మధ్యలో చిన్న నదులు ఎందుకు వదలడం అని విశ్రాంతి తీసుకున్నా. దర్శకుడు సుజీత్‌తో తదుపరి సినిమా ఉంటుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒకటి, గోపీకృష్ణా మూవీస్‌లో మరో సినిమా కూడా ఓకే చేశా’’నన్నారు.
 
 రిలీజ్ కన్నా ముందే థియేటర్స్‌లో వర్చ్యువల్ రియాలిటీ!
 రాజమౌళి తమ కొత్త ప్రయత్నాల్ని వివరిస్తూ - ‘‘వర్చ్యువల్ రియాలిటీ అనేది ప్రపంచంలో అభివృద్ధి అవుతోన్న టెక్నాలజీ. మనం సినిమా చూస్తున్నప్పుడు మూడో వ్యక్తిగా తెరపై జరిగే దృశ్యాలను చూస్తాం. వర్చ్యువల్ రియాలిటీ అంటే... ఆ సినిమాలోని దృశ్యంలో మనమూ ఉన్న ఓ క్యారెక్టర్‌లా భాగమై, అక్కడ జరుగుతున్న దృశ్యాలను 360 డిగ్రీలలో ప్రేక్షకులు అనుభూతి చెందడం అన్నమాట. మాహిష్మతి రాజ్యమనే ప్రపంచం లోకి వెళ్లి, అందులో ఓ మనిషిలా కథను, దృశ్యాలను ప్రేక్షకులకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. మేకింగ్ వీడియోలను ఈ పద్ధతిలో రిలీజ్ చేస్తున్నాం.
 
 దానికి 25 కోట్ల బడ్జెట్ కేటాయించాం. 200 నుంచి 300 థియేటర్లలో ప్రత్యేకంగా వీడియో బూత్‌లు, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నాం. సినిమా రిలీజ్‌కు ఓ నెల ముందే వర్చ్యువల్ రియాలిటీ వీడియోలను విడుదల చేస్తాం. ప్రపంచం మొత్తంలోనే ఇలా చేయడం ఇదే తొలిసారి’’ అని చెప్పారు. ‘‘సినిమా లానే కామిక్ బుక్స్, వీఆర్ అన్నీ భారీ బడ్జెట్‌తోనే రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘వీఆర్ గ్రాఫిక్స్ వర్క్ లాస్ ఏంజెల్స్‌లో జరుగుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నమే మా వీఆర్ టెస్ట్ షాట్ చూశాం. అమెరికాలో కొద్ది నెలల క్రితం నేను చూసిన ఇతర చిత్రాల వాటి కన్నా మంచి క్వాలిటీతో మనది వచ్చింది’’ అని చెప్పారు.

2 పాటలు, కొన్ని సీన్లే బాకీ!
 విలేకరులు అడిగిన ప్రశ్నలకు జవాబిస్తూ, ‘‘దాదాపు రెండున్నర నెలలు శ్రమించి, కష్టమైన క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాల చిత్రీకరణ పూర్తి చేశాం. ఎడిటింగ్ పూర్తి చేసి, గ్రాఫిక్స్‌కీ ఇచ్చేశాం. ఇంకా 2 పాటలు, ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్, కొన్ని సీన్లే బాకీ. వాటికి గ్రాఫిక్స్ అవసరం లేదు’’ అని రాజమౌళి చెప్పారు. ‘‘ఈ సెకండ్ పార్ట్‌లో అనుష్కే హీరోయిన్. తమన్నా కూడా ఉంటుంది. కానీ, ఆమెకు పాటలుండవు’’ అన్నారు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే, ఈ 2వ పార్ట్‌కి తనపై అంత ఒత్తిడి లేదన్నారు. ‘‘తెలుగులో ‘బాహుబలి1’ వసూళ్ల కంటే ఓ 30 -40 శాతం ఎక్కువ సెకండ్ పార్ట్ వసూలు చేస్తుందనీ, హిందీ, మలయాళాల్లో టాప్ 10లో, తమిళంలో టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందనీ అంచనా వేస్తున్నాం’’ అన్నారు.
 
 పార్ట్ 3కీ ఛాన్స్ ఉంది!
 ‘దాదాపు మూడున్నరేళ్ళ పైగా ఈ సినిమాతో ముడిపడిన హీరో ప్రభాస్ సహా ఆర్టిస్టులందరూ ఈ డిసెంబర్ మధ్య కల్లా ‘బాహుబలి’ షూటింగ్ నుంచి రిలీజై పోనున్నారు. అయితే, ఇందరి కష్టమున్న ‘బాహుబలి’ కథను రకరకాల రూపాల్లో సిరీస్‌గా కొనసాగిస్తాన్నట్లు రాజమౌళి చెప్పారు. పార్ట్3కీ ఛాన్స్ ఉందనే విషయాన్ని అంగీకరించారు. శోభూ యార్లగడ్డ మాట్లాడుతూ - ‘‘వచ్చే జనవరిలో ట్రైలర్ రిలీజ్ చేస్తాం’’ అన్నారు.


 

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)