amp pages | Sakshi

అక్కడ నటించడానికి అనుష్కకు ఇష్టంలేదా?

Published on Tue, 01/02/2018 - 18:56

కోలీవుడ్‌లో అవకాశాల కోసం చాలా మంది ఆరట పడుతుంటారు. ముఖ్యంగా కథానాయిక అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. ఇక్కడ రాణిస్తే ఇతర భాషల్లో అవకాశాలు ముంగిట వాలతాయి. బాలీవుడ్‌ బ్యూటీస్‌ కూడా కోలీవుడ్‌లో అవకాశాలొస్తే చేజార్చుకోవడానికి ఇష్టపడరు. అలాంటిది అనుష్క మాత్రం కోలీవుడ్‌ అంటేనే విముఖత చూపుతున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. 2005లో ‘సూపర్‌’  సినిమా ద్వారా తెరంగేట్రం చేసిన ఈ యోగా టీచర్‌ అదే జోరుతో రెండో చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయ్యారు. సుందర్‌.సీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క అందాలను మితి మించి ఆరబోసి సినీ ప్రియులకు కనువిందు చేసింది. అయినా ఫలితం లేకపోయింది. కోలీవుడ్‌ అనుష్క అందాలను పట్టించుకోలేదు. దీంతో తెలుగులోనే దృష్టి సారించింది. అక్కడ పాపులర్‌ అయిన తరువాతనే మళ్లీ కోలీవుడ్‌ అవకాశాలు ఇచ్చింది. విజయ్‌తో నటించిన వేట్టైక్కారన్‌ చిత్రం అనుష్కకు ఇక్కడ తొలివిజయం అని చెప్పవచ్చు. 

ఆ తరువాత కోలీవుడ్‌లో వరుసగా అందిపుచ్చుకున్నారు. ఈ బ్యూటీపై టాలీవుడ్‌లో పలు వదంతులు ప్రచారమైనా, అంతకు మించి కోలీవుడ్‌లోనూ హల్‌చల్‌ చేశాయి. ముఖ్యంగా నటుడు ఆర్యతో కలిపి రకరకాల వదంతులు దొర్లాయి. అలాంటివి అనుష్కను చాలానే ఇబ్బందులు పెట్టాయి. అదీ కాకుండా ఇక్కడి మీడియా తరచూ ఏదో ఒక అసత్యప్రచారం చేస్తూ అనుష్కను మనస్తాపానికి గురి చేసిందనే చింత అనుష్కలో ఏర్పడింది. దీంతో తమిళ మీడియాను దూరంగా పెట్టేశారనేది ప్రచారంలో ఉంది. అదీగాక ఈ మధ్య అనుష్క నటించిన తమిళ చిత్రం ఏదీ పెద్దగా సక్సెస్‌ కాలేదు. ఈ కారణంగానూ కోలీవుడ్‌లో కొన్ని అవకాశాలను అనుష్క వాంటెడ్‌గానే నిరాకరిస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. దీంతో అనుష్క కోలీవుడ్‌పై విముఖత చూపిస్తుందనే ప్రచారానికి సోషల్‌ మీడియా తెరలేపింది.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)