amp pages | Sakshi

త్వరలో మా ఏపీ ఎన్నికలు

Published on Sun, 03/22/2020 - 04:05

‘‘మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌’ (మా) ఆంధ్రప్రదేశ్‌ కార్యవర్గం పదవీకాలం ముగియడంతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నాం’’ అని ‘మా–ఏపీ’ వ్యవస్థాపకుడు,  దర్శకుడు దిలీప్‌ రాజా తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలోని ‘మా–ఏపీ’  కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం ‘మా–ఏపీ’ అధ్యక్షురాలు కవిత, ప్రధాన కార్యదర్శి నరసింహరాజు, సెక్రటరీలు అన్నపూర్ణ, శ్రీలక్ష్మీ.. మిగతా కార్యవర్గ సభ్యులు తమ రాజీనామాలను అందజేయవచ్చు.. తిరిగి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక నామినేషన్‌లు వేసుకోవచ్చు.

ఈసారి ‘మా–ఏపీ’ అధ్యక్ష స్థానానికి ఒక ప్రముఖ హీరో బరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ‘మా–ఏపీ’లో శాశ్వత సభ్యత్వం గల సభ్యులందరికీ ఓటు హక్కు ఉంటుంది. తాత్కాలిక సభ్యులకు ఓటు హక్కు ఉండదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై రాష్ట్రాలకు చెందినవారు పోటీ చేయవచ్చు. కరోనా వైరస్‌ ప్రభావంతో ఈ నెల 31 వరకు ఏపీలో షూటింగ్‌లు నిలిపివేశాం. ఎవరైనా షూటింగ్‌లు జరిపితే శాశ్వత సభ్యత్వాలను రద్దు చేస్తాం’’ అన్నారు. ఈ సమావేశంలో దర్శకులు శ్రీధర్, రత్నాకర్, స్టోరీ బోర్డు సభ్యుడు అశోక్‌ వడ్లమూడి, ప్రొడక్షన్‌ మేనేజర్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)