amp pages | Sakshi

పాడ్‌మాన్‌ ట్రైలర్‌.. అక్కీ గట్స్‌కి హాట్సాఫ్‌

Published on Fri, 12/15/2017 - 12:59

సాక్షి, సినిమా :  బాలీవుడ్‌ అగ్ర హీరో అక్షయ్‌ కుమార్‌ ఈ మధ్య తన చిత్రాల ఎంపికలో మాములు వైవిధ్యం ప్రదర్శించటం లేదు. యాక్షన్‌ కిలాడీగా పేరున్న ఆయన గత కొంత కాలంగా ఆ ట్యాగ్‌ లైన్‌కు దూరంగా ఉంటూ విమర్శకుల చేత శభాష్‌ అనిపించుకునే కథలను ఎంచుకుంటున్నారు. ఎయిర్‌లిఫ్ట్, రుస్తుం, టాయ్‌లెట్‌-ఏక్‌ ప్రేమ్‌కథా ఇలా వరుసపెట్టి చేసిన చిత్రాలే అందుకు నిదర్శనం. 

ఇక ఇప్పుడు కొత్త చిత్రం పాడ్‌మాన్‌ కూడా ఆ కోవలోనిదే. ఆ చిత్ర ట్రైలర్‌ కాసేపటి క్రితం వచ్చేసింది. అమెరికాకు స్పైడర్‌ మాన్ ఉన్నాడు.. బ్యాట్‌ మాన్‌ ఉన్నాడు. సూపర్ మాన్ ఉన్నాడు. ఇక ఇండియాకు పాడ్ మాన్ ఉన్నాడు అంటూ అమితాబ్ బచ్చన్‌ వాయిస్‌ ఓవర్‌ తో ట్రైలర్‌ మొదలయింది. దేశానికి కావాల్సింది శక్తివంతమైన మహిళలే అని హీరో ట్రైలర్  డైలాగ్ చెప్పటం చూడొచ్చు. అతని వ్యవహారం నచ్చక భార్య, కుటుంబం దూరమైన క్రమంలో అతనికి సాయం అందించే పాత్రలో సోనమ్‌ కపూర్‌ నటించింది. ఇక అక్షయ్‌ భార్య పాత్రలో రాధికా ఆప్టే కనిపించింది. కాస్త వైవిధ్యం, కొన్ని పాయింట్లు ఎబ్బెట్టుగా ఉన్నప్పటికీ కథలో కంటెంట్‌ మాత్రం చాలా బలంగానే ఉన్నట్లు అనిపిస్తోంది. మహిళల సమస్యపై ఇంత బోల్డ్‌గా నటించే ధైర్యం బహుశా అక్కీ తప్ప మరెవరూ చేయరేమో. 

ఇక 'పాడ్‌మాన్' కథ విషయానికొస్తే... అరుణాచలం మురుగనాథం అనే ఓ సోషల్ ఎంట్రపెన్యూర్‌కి సంబంధించిన కథ. భారతదేశంలో అతి తక్కువ ధరకి శానిటరీ నేప్‌కిన్స్‌ని అందజేయ్యొచ్చునని నిరూపించిన వ్యక్తి.. అంతర్జాతీయ సత్కారాలు కూడా అందుకున్న అతని బయోపిక్‌ ని దర్శకుడు ఆర్ బాల్కీ దృశ్యరూపకంగా పాడ్‌మాన్‌ పేరుతో మలిచారు. రిపబ్లిక్‌ డే కానుకగా పాడ్‌మాన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)