amp pages | Sakshi

'అక్కడొకడున్నాడు' షూటింగ్ ప్రారంభం

Published on Sun, 04/30/2017 - 15:35

లైట్  హౌస్ సినీ మ్యాజిక్ ప‌తాకంపై శివ శంక‌ర రావు కంట‌గ‌మ‌నేని, కె. వెంకటేశ్వర‌రావు సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా 'అక్కడొక్కడున్నాడు'. రామ్ కార్తిక్, దీపిక హీరో, హీరోయిన్లుగా న‌టిస్తున్నా ఈ సినిమా ఆదివారం హైద‌రాబాద్ లో ప్రారంభ‌మైంది. ముహూర్తపు స‌న్నివేశానికి ల‌హ‌రి ఎస్టేట్స్ అధినేత హ‌రిబాబు క్లాప్ నివ్వగా, ర‌వీంద‌్రరావు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత సి. క‌ల్యాణ్ గౌర‌వ ద‌ర్శక‌త్వం వ‌హించారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత‌ల‌లో ఒక‌రైన వెంక‌టేశ్వర‌రావు మాట్లాడుతూ, 'క‌థ కొత్తగా ఉంటుంది. క‌థ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా.  అందుకే సినిమా నిర్మాణానికి పూనుకున్నా. ప్రతీ పాత్ర ఆద్యంత ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. సింగిల్ షెడ్యూల్ లో సినిమా పూర్తి చేస్తాం. మిగ‌తా ప‌నులు కూడా పూర్తిచేసి వీలైనంత త్వర‌గా సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని అన్నారు.

మ‌రో నిర్మాత శివ‌శంక‌ర‌రావు మాట్లాడుతూ, 'గ‌తంలో కొన్ని సినిమాల్లో న‌టించాను. కానీ మ‌ళ్లీ వ్యాపార రంగంలో బిజీ అవ్వాల్సి వ‌చ్చింది.  ఇప్పుడు మ‌ళ్లీ అక్కడొక‌డున్నాడు సినిమా తో  రీ ఎంట్రీ ఇస్తున్నా. ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నా. పాత్ర చాలా వైవిథ్యంగా ఉంటుంది. తెలుగు లో ఇప్పటివ‌ర‌కూ ఇలాంటి కాన్సెప్ట్తో ఎవ్వరు సినిమా చేయ‌లేదు. అన్ని వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించే సినిమా అవుతుంద'న్నారు.

చిత్ర ద‌ర్శకుడు శ్రీపాడ విశ్వక్ మాట్లాడుతూ, 'పొర‌పాటుకు- త‌ప్పుకు మ‌ధ్య జ‌రిగే సంఘ‌ర్షణే ఈ సినిమా. ప్రేమ అంటే అందాన్ని ఆక‌ర్షించ‌డం కాదు. వ్యక్తిత్వాన్ని ఆరాధించ‌డం. ఇద్దరు ప్రేమికులు అనుకోకుండా విప‌త్కర ప‌రిస్థితుల‌కు లోనైతే స్వచ్ఛమైన ప్రేమ వారిని ఎలా కాపాడుతుంద‌నే పాయింట్  పొర‌పాటు- త‌ప్పుగా డివైడ్ చేసి చూపిస్తున్నాం. ప్రతీ పాత్రలో చ‌క్కని ఎమోష‌న్ ఉంటుంది. ఆ భావోద్వేగాల‌ను క‌న్వెన్సింగ్గా చెబుతున్నా. టెక్నిక‌ల్గాను సినిమా హైలైట్ గా ఉంటుంది. మే 2 నుంచి 20 వ‌ర‌కూ కంటున్యూస్గా షూటింగ్ చేస్తామ'న్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌