amp pages | Sakshi

విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో..

Published on Thu, 08/08/2019 - 07:25

చెన్నై,పెరంబూరు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సినీ ప్రేక్షకులను ఎంతగా రంజింపజేస్తుందో, సినీ నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యజ మాన్యాన్ని ఘోరంగా ముంచేస్తోంది. పైరసీదా రులను ఎవరూ అరికట్టలేని పరిస్థితి. పైరసీదా రులు ఎంత దారుణానికి ఒడికడుతున్నారంటే కొత్త చిత్రం తెరపైకి రాక ముందే అక్రమంగా వెబ్‌సైట్స్‌లో ఆడేస్తున్నాయి. ఎన్నో కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న చిత్రాలకు వందల మంది శ్రమ, కృషి ఉంటుంది. వందల మంది జీవనం సిని మా. అలాంటి సినిమాను క్షణాల్లో అక్రమంగా దోచుకుంటున్నారు. ఈ విషయంలో న్యాయస్థానాలు ఏం చేయలేని పరిస్థితి. తాజాగా నేర్కొం డ పార్వై చిత్రం అలాంటి అక్రమ దోపిడికే గురైంది.

విడుదలకు రెండు రోజుల ముందే.
స్టార్‌ నటుడు అజిత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం నేర్కొండ పార్వై. నటి విద్యాబాలన్, శ్రద్ధాశ్రీనాథ్, అబిరామి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని దివంగత నటి శ్రీదేవి భర్త, ప్రముఖ హిందీ చిత్ర నిర్మాత భోనీకపూర్‌ నిర్మించారు. ఆయన నిర్మించిన తొలి తమిళ చిత్రం ఇదే. హిందీ చిత్రం పింక్‌కు రీమేక్‌ ఇది. హేచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురువారం తెరపైకి రానుంది. కాగా మంగళవారం నుంచే చిత్ర ప్రీమియం షోలను ప్రదర్శించారు. విదేశాల్లోనూ విడుదల చేశారు. చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అజిత్‌ నటనకు ప్రశంసల జల్లు కురుస్తోంది. కాగా ఎక్కడ? ఎవరు? చిత్ర పైరసీకి పాల్పడ్డారో గాని నేర్కొండపార్వై మంగళవారం సాయంత్రమే వెబ్‌సైట్లలో వైరల్‌ అవుతోంది. ఇలా విడుదలకు రెండు రోజులు ముందే కొత్త చిత్రం ఇంటర్నెట్లలో ప్రచారం అయితే ఏ ఎగ్జిబిటర్‌ మాత్రం చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ఇష్టపడతాడు? అజిత్‌ వంటి ప్రముఖ నటుడి చిత్రానికే ఈ గతి అయితే ఇక చిన్న చిత్రాల పరిస్థితి ఏమిటని సినీ వర్గాలు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

కోర్టు తీర్పును ధిక్కరిస్తూ..
నిర్మాత భోనీకపూర్‌ నేర్కొండ పార్వై చిత్రాన్ని పైరసీ నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముందుగానే చెన్నై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందులో నేర్కొండ పార్వై చిత్రానికి సంబంధించిన అన్ని హక్కులు తమకే చెంది ఉన్యాయని చిత్రాన్ని వెబ్‌సైట్లలో అక్రమంగా ప్రచారం కాకుండా నిషేధించాలని ఆ పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారించిన న్యాయస్థానం నేర్కొండ పార్వై చిత్రాన్ని వెబ్‌సైట్లలో ప్రచారంపై నిషేధం విధిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు సుమారు 1129 వెబ్‌సైట్స్‌ను మూయించి వేసిం ది. అయినా కోర్టు ఆదేశాలను భేఖాతరు చేస్తూ  విడుదలకు రెండు రోజుల ముందే నేర్కొండ పార్వై చిత్రం వెబ్‌సైట్స్‌లో విడుదలైంది.

Videos

మంగళగిరి పబ్లిక్ టాక్ లోకేష్ VS లావణ్య

చంద్రబాబుకు రోజా సూటి ప్రశ్న

జగన్ గారు నాకిచ్చిన బాధ్యత "కుప్పం" కుంభస్థలం బద్దలే బాబు

షర్మిల ప్రచారం అట్టర్ ఫ్లాప్..!

పవన్ కళ్యాణ్ లేదు తొక్క లేదు.. జగనన్న కోసం ప్రాణం ఇస్తా ... తగ్గేదేలే

గన్నవరంలో జోరుగా వల్లభనేని ఎన్నికల ప్రచారం

త్వరలో తెలంగాణలో వాలంటీర్ వ్యవస్థ: దేవులపల్లి అమర్

పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "

అబద్ధం చాలా అందంగా ఉంటుంది చంద్రబాబు మేనిఫెస్టోలా..!

ఓటమి భయంతోనే పిఠాపురానికి మకాం: శేషు కుమారి

4 కంటైనర్ లలో డబ్బు రవాణా 2 వేల కోట్లు పట్టుకున్న ఏపీ పోలీసులు

చంద్రబాబు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న వృద్ధురాలు..!

మ్యానిఫెస్టో ని ఇంటింటికీ తీసుకువెళ్లటమే జగన్ కోసం సిద్ధం

చంద్రబాబు బ్యాచ్ కుట్రలతో పెన్షన్ దారులకు మరిన్ని కష్టాలు

ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై కూటమి అసత్యపు ప్రచారం చేస్తోంది

అందుకు ఏదైనా చికిత్స చేయించుకున్నారా?

చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్

Election Track: గెలుపు ఎవరిది ?..రాజమహేంద్రవరం ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్

కార్మికులను ఆదుకున్నది సీఎం జగన్ మాత్రమే

Photos

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)