amp pages | Sakshi

రెండు సినిమాల జర్నీ

Published on Sun, 05/05/2019 - 03:30

సినిమాలను ఫైనలైజ్‌ చేయడమే కాదు... ఆ సినిమాలను సెట్స్‌పైకి తీసుకెళ్లడంలోనూ అంతే పకడ్బందీగా ప్లాన్‌ చేసుకుంటున్నారు అల్లు అర్జున్‌. ప్రస్తుతం త్రివిక్రమ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ ఓ సినిమాలో హీరోగా  నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెట్స్‌పైన ఉండగానే సుకుమార్‌ దర్శకత్వంలో నటించనున్న సినిమాను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్తున్నారు అల్లు అర్జున్‌. ‘ఆర్య (2004), ఆర్య 2(2010)’ చిత్రాల తర్వాత  సుకుమార్‌–అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రానున్న మూడో చిత్రం ఇది. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ నెల 11న జరగనుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్‌ నిర్మిస్తారు. ఇందులో రష్మికా మండన్నా హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించాలనుకుంటున్నారు. సో.. అటు త్రివిక్రమ్‌ ఇటు సుకుమార్‌ సినిమాలు చేస్తూ బన్నీ ఫుల్‌ బిజీగా ఉంటారన్న మాట. ఇవి కాకుండా ‘ఓ మైఫ్రెండ్, ఏమ్‌సీఏ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘ఐకాన్‌: కనపడుటలేదు’ అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌