amp pages | Sakshi

ఆర్టీసీ స్పెషల్‌ బాదుడు!

Published on Sun, 02/11/2018 - 12:25

కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్‌ ఆర్టీసీ మహాశివరాత్రి వేడుకలను అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. నాలుగు రోజుల్లో రూ.3.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించేందుకు జిల్లాలోని 13 శైశక్షేత్రాలకు బస్సులను నడిపేందుకు రంగం సిద్ధంచేసింది. నేటి నుంచి 14వ తేదీ వరకు 393 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. ఈ స్పెషల్‌ బస్సుల్లో ప్రయాణికుల టిక్కెట్‌పై 50 శాతం అధికంగా వసూలు చేయనున్నారు. 

కర్నూలు నుంచి ప్రతి పది నిమిషాలకు శ్రీశైలానికి బస్సు..
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైల మహాక్షేత్రం ప్రధానమైంది. మహాశిరాత్రి రోజుల్లో మల్లికార్జునుడు, భ్రమరాంబదేవిలను దర్శించుకుంటే పుణ్యమొస్తుందనే నమ్మకంతో జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా వస్తారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులు ఇబ్బంది పడకుండా కర్నూలు నుంచి 106 స్పెషల్‌ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. అందులో ప్రతి పది నిమిషాలకు ఒక్క బస్సు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ నుంచి శ్రీశైలానికి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 6 న బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేటి నుంచే శ్రీగిరికి భక్తుల తాకిడి అధికం కానుండడంతో 11, 12, 13, 14 తేదీల్లో స్పెషల్‌ బస్సులను అధికంగా నడుపుతారు. శ్రీశైలంతోపాటు మరో 12 శైవక్షేత్రాలకు మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. 

ఇతర రీజియన్ల నుంచి 200 బస్సుల రాక..
కర్నూలు–శ్రీశైలం రహదారి ఘాట్‌ కావడంతో ఫిట్‌నెస్‌ ఉన్న బస్సులనే నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఘాట్‌ ఎలిజిబుల్‌ ఫిట్‌నెస్‌ పాసైన కర్నూలు రీజియన్‌లోని 193 బస్సులకు ఎంపికచేశారు. మిగిలిన బస్సులను నెల్లూరు నుంచి 60, తిరుపతి నుంచి 40, అనంతపురం నుంచి 100 ఘాట్‌ ఎలిజిబుల్‌ ఉన్న వాటిని తెప్పించుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక మార్గమధ్యలో బస్సులు మరమ్మతులకు గురైతే బాగు చేసేందుకు శ్రీశైలం, దోర్నాలలో వెహికల్‌ మెయింటెనెన్స్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు.  

ఆర్టీసీకి కాసులుకురిపిస్తున్న శివరాత్రి
రెండు, మూడేళ్ల నుంచి కూడా శివరాత్రి ఉత్సవాలు ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 2016లో 329 ప్రత్యేక బస్సులు 6.90లక్షల కిలోమీటర్లు తిరిగి రూ.2.84 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక 2017లో 372 ప్రత్కేక బస్సులు 7.30 లక్షల కిలోమీటర్లు తిరిగి రూ.311.16 కోట్ల ఆదాయం సమకూర్చాయి. ఈ యేడాది ఏకంగా రూ.3.50కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితం
మహాశివరాత్రి ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం 393 ప్రత్యేక బస్సులను వివిధ శైవ క్షేత్రాలకు నడుపుతాం. అత్యధికంగా శ్రీశైలానికి ఎక్కువ బస్సులు వెళ్తాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే మల్లన్న స్వామి దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచిస్తున్నాం. ప్రమాదాలకు గురికాకుండా సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులే మేలు.   – పైడి చంద్రశేఖర్, ఆర్‌ఎం  

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)