amp pages | Sakshi

ట్రంప్‌ వర్గంలో కీలక వ్యక్తి రాజీనామా

Published on Tue, 05/30/2017 - 18:25

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో పనిచేస్తున్న వ్యక్తులు ఒక్కొక్కరుగా తమ బాధ్యతలకు గుడ్‌బై చెప్పేస్తున్నారు. డోనాల్డ్‌ ట్రంప్‌ కమ్యునికేషన్‌ డైరెక్టర్‌ మైక్‌ దుబ్కే తన బాధ్యతలకు రాజీనామా చేశారు. మే 18న తాను వైదొలుగుతున్నట్లు ప్రకటించి రాజీనామా లేఖ రాసిన ఆయన ఆ సమయంలో ట్రంప్‌ తొలి పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో అలాగే ఉండిపోయారు. ట్రంప్‌ పర్యటన నుంచి వచ్చిన నేపథ్యంలో ఇ‍ప్పుడు ఆ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించారు.

అతడి స్థానంలో మరోకొత్త వ్యక్తిని సామరస్యపూర్వక వాతవరణంలో నియమించాలనే ఉద్దేశంతోనే ఈ విషయాన్ని పెద్దగా హైలైట్‌ చేయకుండా ఆ బాధ్యతల్లో కొనసాగిస్తున్నారు. ఏ తేదీన ఆయన బాధ్యతలు వదులుకోవాల్సి ఉంటుందనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ప్రస్తుతానికి విధులకు హాజరవుతున్నారు. ‘అధ్యక్షుడు ట్రంప్‌ వద్ద, ఆయన పరిపాలన వర్గంలో పనిచేసే అదృష్టం రావడం నాకు దక్కిన గొప్ప గౌరవం. ఇక ప్రస్తుతం ఇక్కడ నా విధులకు స్వస్తి పలికి గతంలో నేను పనిచేసిన  బ్లాక్‌ రాక్‌ గ్రూప్‌లో తిరిగి కమ్యునికేషన్‌, ప్రజాసంబంధాల శాఖలో పనిచేసేందుకు వెళుతున్నాను’ అంటూ తన స్నేహితులకు ఈమెయిల్స్‌ ద్వారా మైక్‌ చెప్పారు.

ట్రంప్‌ వద్ద మైక్‌ గత మూడు నెలలుగానే బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం గోప్యతకు సంబంధించిన సమాచారం రష్యాకు ఉద్దేశ పూర్వకంగా లీక్‌ చేస్తున్నారని ట్రంప్‌పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని తుడిచివేసుకునే ప్రయత్నంలో భాగంగానే తాజాగా మైక్‌తో రాజీనామా చేయిస్తున్నట్లు సమాచారం.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)