amp pages | Sakshi

ప్రభుత్వ లబ్ధి పొందితే గ్రీన్‌కార్డ్‌ నో

Published on Wed, 01/29/2020 - 00:58

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన ఒక గ్రీన్‌కార్డ్‌ నిబంధనకు అమెరికా సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్న వలసదారులకు గ్రీన్‌ కార్డ్‌ను నిరాకరించే ఈ విధానం వల్ల భారతీయులు నష్టపోయే అవకాశముంది. మెడిక్‌ ఎయిడ్, ఫుడ్‌ స్టాంప్స్, హౌసింగ్‌ వోచర్స్‌ తదితర ప్రయోజనాలు పొందిన వారికి అమెరికాలో శాశ్వత నివాస సౌకర్యాన్ని కల్పించే గ్రీన్‌కార్డ్‌ను నిరాకరించాలని ప్రతిపాదిస్తూ ఆ నిబంధనను రూపొందించారు. ఆ నిబంధన అమలుకు ఆమోదం తెలుపుతూ సోమవారం సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ధర్మాసనంలోని న్యాయమూర్తుల్లో ఐదుగురు ఈ పాలసీకి మద్దతివ్వగా, నలుగురు వ్యతిరేకించారు. ఈ కొత్త నిబంధన అమలుపై స్టే విధిస్తూ న్యూయార్క్‌లోని రెండో సర్క్యూట్‌ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టేసింది.

పలు రాష్ట్రాల్లో ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. తాజా నిబంధన ప్రకారం.. గ్రీన్‌ కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకునే వలసదారులు తాము ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేదని, భవిష్యత్తులోనూ వాటిని ఆశించబోమని, ఈ దేశానికి తాము భారం కాబోమని ధ్రువీకరించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు భవిష్యత్తులోనైనా ఆ ప్రయోజనాలు పొందే అవకాశముందని అధికారులు భావిస్తే.. వారికి గ్రీన్‌ కార్డ్‌ను నిరాకరించే అవకాశం కూడా ఉంది. ఏటా దాదాపు 5.4 లక్షల మంది గ్రీన్‌కార్డ్‌కు అప్లై చేసుకుంటారు. అయితే, వలసదారుల్లో కొందరికి మాత్రమే.. వారి ఇమిగ్రేషన్‌ స్టేటస్‌ను బట్టి మెడిక్‌ ఎయిడ్, ఫుడ్‌ స్టాంప్స్, హౌసింగ్‌ వోచర్స్‌.. తదితర  ప్రభుత్వ ప్రయోజనాలు పొందే అర్హత ఉంటుంది.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)