amp pages | Sakshi

రంజాన్ కు వినూత్న స్వాగతం!

Published on Sat, 06/11/2016 - 15:49

జెడ్డాః రంజాన్ పర్వదినాల్లో ముస్లిం సోదరుల ఉపవాస దీక్షలు, మసీదుల్లో ప్రార్థనలతో నెల రోజులపాటు పండుగ వేడుక అంగరంగ వైభవంగా సాగుతుంది. సూర్యోదయానికి పూర్వం నుంచీ సూర్యాస్తమయం వరకూ కఠిన ఉపవాస దీక్ష (రోజా) ను చేపట్టి, రాత్రి సమయంలో ఇఫ్తార్ విందుతో ఉపవాసాన్ని విడుస్తారు. నెల రోజులపాటు ఉపవాసాలు ముగిసిన తర్వాత రంజాన్ పండుగ జరుపుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి నెల్లాళ్ళ పాటు దాన ధర్మాలతో, భక్తిమార్గంలో జరుపుకునే ఈ రంజాన్ పండుగకు  ముగ్గురు పాకిస్తానీ యువకులు వినూత్నంగా స్వాగతం పలికారు. అందరికీ ఆసక్తికరంగా ఉండేట్టు నీటి అడుగు భాగంలో వేడుకలకు శ్రీకారం చుట్టారు. ఎర్ర సముద్రం దిగువ భాగాన లాంతర్ల వెలుగులో పండుగను కొత్త రకంగా ఆహ్వానించారు.

సౌదీ అరేబియాలో నివసిస్తున్న యహేయా అష్ఫాక్,  ఉమర్ జాన్, ఖాజీ అజ్మా లు ఎర్ర సముద్రం దిగువ భాగాన నూతన మార్గంలో  రంజాన్ వేడుకలను ప్రారంభించారు. జెడ్డా తీర ప్రాంతంలోని ఎర్ర సముద్రం లోపలికి వెళ్ళి, నీటి అడుగు భాగంనుంచీ  రంజాన్ కు స్వాగతం పలికారు. వారితోపాటు తీసుకెళ్ళిన లాంతర్ల వెలుగులోనే నీటికింద  వేడుకలను నిర్వహించినట్లు కార్యక్రమం మొత్తాన్ని చిత్రీకరించిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ యహేయా...స్థానిక వార్తా పత్రికకు తెలిపారు. సముద్రతీర ప్రాంతాలు, పగడపు దిబ్బలు, బీచ్ లను హైలెట్ చేసేందుకు,  మన జీవితాల్లో వాటి ప్రాముఖ్యతను తెలపడమే తమ లక్ష్యమని చెప్తున్నారు. రంజాన్ సందర్భంగా నీటి అడుగు భాగాన వేడుకలు నిర్వహించడానికి అదే ముఖ్య కారణమంటున్నారు.  అండర్ వాటర్ జీవితం ఎలా ఉంటుందో ఇప్పటివరకూ కనిపెట్టలేదని, ఇది పర్యాటకాన్ని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందే యహేయా దుబాయ్, యాన్బులలో నీటి అడుగు భాగంలో డైవింగ్ చేశాడు. ప్రస్తుతం ఈ ముగ్గురు వ్యక్తుల బృందం రంజాన్ సందర్భంగా  సముద్రానికి 140 అడుగుల కింది భాగంలో జెండాలు ఊపుతూ ప్రార్థనలు నిర్వహించినట్లు వారు చిత్రీకరించిన వీడియోలను బట్టి తెలుస్తోంది.

జెడ్డా పరిసర ప్రాంతాల్లో డైవింగ్ కు వెళ్ళేందుకు ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య సమయం ఉత్తమమైనదని,  సంవత్సరం మొత్తంలో ఆ రెండు నెలల సమయంలోనూ నీటి అడుగు భాగం  ప్రత్యక్షంగా కనిపిస్తుందని, అలాగే నీటి ఉష్ణ్రోగ్రత కూడ సరిపడేట్లు ఉంటుందని యహేయా చెప్తున్నారు. భూమ్మీద, ఆకాశంలోనే కాక, నీటి అడుగు భాగాన కూడ విహరించి ఆనందించవచ్చని చెప్పడమే లక్ష్యంగా ఈ బృదం రంజాన్ వేడుకలను సముద్రానికి అడుగు భాగాన నిర్వహించింది.

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)