amp pages | Sakshi

అబద్ధం చెప్పని ఓ అద్దం కథ!

Published on Tue, 08/07/2018 - 02:22

అద్దమెప్పుడూ అబద్ధం చెప్పదంటారు..మిగతావాటి సంగతి తెలియదుగానీ..ఈ అద్దం మాత్రం చెప్పదట..సత్యహరిశ్చంద్రుడిలా ఎప్పుడూ నిజమే చెబుతుందట.. కావాలంటే.. ‘స్నోవైట్‌’ కథలో అడిగినట్లు.. ‘మిర్రర్‌ మిర్రర్‌ ఆన్‌ ద వాల్‌..’ అంటూ అడగండి.. నిజమే చెబుతుంది. ఇంతకీ దేని గురించి నిజం చెబుతుంది అని అడిగితే.. మీ గురించే అంటారు దీన్ని తయారుచేసిన సిలికాన్‌ వ్యాలీ స్టార్టప్‌ కంపెనీ ‘నేక్డ్‌ ల్యాబ్స్‌’
ప్రతినిధులు.. ఇంతకీ మన గురించి ఇది చెప్పే ఆ నిజమేంటి? 

రోజూ పేపర్‌ తిరగేస్తే.. 
భారతీయులు బరువెక్కువున్నారు.. కొవ్వు శాతం ఎక్కువైంది.. దీనివల్ల ఆ జబ్బు వస్తుంది.. ఈ రోగం రావచ్చు అని వార్తలే వార్తలు.. కదా.. అందుకే ఓసారి మన శరీరం పరిస్థితేమిటి? ఎక్కడ కొవ్వు శాతం ఎక్కువైంది? ఒకవేళ తగ్గించుకోవడానికి మనం కసరత్తులు వంటివి చేస్తుంటే.. డైట్‌లు వంటివి పాటిస్తుంటే.. అవి నిజంగా పనిచేస్తున్నాయా? శరీరంలో నిజంగానే కొవ్వుతగ్గుతుందా లేదా పెరుగుతుందా? పెరిగితే.. ఎక్కడ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి విషయాలకు సంబంధించిన ‘నగ్న’సత్యాన్ని ‘నేక్డ్‌’ అనే ఈ మ్యాజిక్‌ మిర్రర్‌ మన ముందుంచుతుందట.

అదెలా? 
ముందుగా మనం అద్దానికి ఎదురుగా ఉండే పీటలాంటి దాని మీద నిల్చోవాలి. అది మనల్ని చుట్టూ తిప్పుతుంది.. ఇలా 20 సెకన్లపాటు చేస్తుంది. అంతలోనే ఆ అద్దం మన శరీరాన్ని స్కాన్‌ చేసేస్తుంది. త్రీడీ మ్యాప్స్‌ తీసేస్తుంది. ఇందుకోసం ఇందులో ఇంటెల్‌ రియల్‌ సెన్స్‌ సెన్సర్లు పెట్టారు. ఆ సమయంలో నగ్నంగా నిల్చుంటే.. మరింత కచ్చితంగా త్రీడీ మోడల్‌ తయారవుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. అనంతరం ఈ మ్యాజిక్‌ మిర్రర్‌తో అనుసంధానించి ఉండే స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లోకి వివరాలు స్టోర్‌ అయిపోతాయి. వెంటనే విశ్లేషణ ప్రారంభమవుతుంది. శరీరంలోని కొవ్వు శాతం.. బరువు, లీన్‌మాస్, ఫ్యాట్‌మాస్‌ వంటి వివరాలు వచ్చేస్తాయి. అప్పట్నుంచి ఈ అద్దం ఎప్పటికప్పుడు మన శరీరంలో వచ్చిన మార్పులను విశ్లేషించి.. సమాచారాన్ని అందిస్తుంది. అంటే వారాలు, నెలలు లెక్కన విశ్లేషణ చేసి.. ఆ నిర్ణీత కాలంలో కొవ్వు తగ్గిందా పెరిగిందా అన్న వివరాలను తెలుపుతుంది. ముఖ్యంగా మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఈ పరికరం తోడ్పడుతుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. కండల వీరులకూ ఉపయోగపడుతుందని.. ఎక్కడ మజిల్‌ పెరిగింది.. ఎక్కడ తగ్గింది వంటి వివరాలనూ అందిస్తుందని అంటున్నారు.  ఇది ప్రపంచంలోనే తొలి హోం బాడీ స్కానర్‌ అని చెబుతున్నారు.

సురక్షితమేనా? 
యాప్‌లో స్టోర్‌ అయ్యే మన వ్యక్తిగత చిత్రాలు, సమాచారం హ్యాక్‌ అయ్యే ప్రమాదముందని సైబర్‌ నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. అలాంటి చాన్సే లేదని కంపెనీ ప్రతినిధులు కొట్టిపారేస్తున్నారు. డాటా హ్యాక్‌ అయ్యే పరిస్థితి లేదని.. పూర్తిస్థాయిలో భద్రతాచర్యలు చేపట్టామని.. పైగా.. ఆ అద్దాలు తీసేవి ఫొటోలు కావని.. త్రీడీ మోడల్‌ మాత్రమేనని.. అది ఎక్స్‌రేలాగ ఉంటుందని చెబుతున్నారు.. సంబంధిత యూజర్‌కు మాత్రమే ఆ సమాచారం అందుబాటులో ఉంటుందని.. భయపడాల్సిన పనేలేదని భరోసా ఇస్తున్నారు. దీని ధర రూ. లక్ష. వచ్చే నెల నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయట.. 
ఇదండీ.. అబద్ధమే ఎరుగని ఓ అద్దం కథ..
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)