amp pages | Sakshi

మహిళపై సింహాల దాడి

Published on Fri, 05/29/2020 - 18:39

సిడ్నీ: ఆస్ట్రేలియా జూలో పని చేసే మహిళపై రెండు సింహాలు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. జూ ఆవరణను శుభ్రపరుస్తుండగా సింహాలు దాడి చేయడంతో సదరు మహిళ తీవ్రంగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం... పారామెడిక్స్ న్యూ సౌత్ వేల్స్ (ఎన్‌ఎస్‌డబ్ల్యు) రాష్ట్రంలోని షోల్‌హావెన్ జూ లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 25 నుంచి  మూసివేశారు. ఈ నేపథ్యంలో జూ ఆవరణను బాధితురాలు శుభ్రం చేస్తుండగా సింహాలు ఆమెపై దాడి చేశాయి. ఇది గమనించిన ఇతర జూ సిబ్బంది సింహాలను గుహలోకి తరిమి ఆమెను రక్షించారు. అయితే అప్పటికే ఆమె తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.

కాగా ఈ ఘటనలో బాధితురాలి మెడ, తల భాగంలో గాయలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయ్యిందని వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు. దీనిపై బాధిత మహిళ మాట్లాడుతూ.. ‘‘నేను గత కొంతకాలంగా జూలో పనిచేస్తున్నా. ఇలాంటి ఘటన జూలో ఎప్పుడు జరగలేదు. ఇది చాలా భయంకరమైనది’’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. జూ వద్ద హై అలర్ట్‌ ప్రకటించామని, ఘటనపై జూ అధికారులు ఇప్పటివరకు స్పందించలేదని పోలీసులు తెలిపారు.

Videos

Watch Live: మాచర్లలో సీఎం జగన్ ప్రచార సభ

ప్రచారంలో భారతమ్మ..!

బాబే భూబకాసురుడు

కవితకు బిగ్ షాక్...నో బెయిల్

టీడీపీ మేనిఫెస్టోపై సీఎం వైఎస్ జగన్ సెటైర్లు

జగన్ అనే రైతు.. వేసిన విత్తనాలు.. మహా వృక్షాలు అవుతాయి..!

వీళ్ళే మన అభ్యర్థులు గెలిపించాల్సిన బాధ్యత మీదే

నా కుటుంబంలో చిచ్చు పెట్టింది పవన్ నే

రేపల్లె గడ్డ దద్దరిల్లే సీఎం జగన్ గూస్ బంప్స్ స్పీచ్

సీఎం జగన్ రాయల్ ఎంట్రీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)