సెకన్ల వ్యవధిలో ఎంత ఘోరం జరిగిపోయింది

Published on Tue, 01/14/2020 - 12:25

బీజింగ్‌ : ప్రమాదాలనేవి ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తాయో ఎవరూ చెప్పలేరు. అందుకు ఉదాహరణగా చైనాలోని గ్జీనింగ్‌ పట్టణంలో చోటుచేసుకున్న ప్రమాదాన్ని చూస్తే అది నిజమేననిపిస్తుంది.రోడ్డుపై వెళుతున్న ఒక బస్సు బస్టాప్‌లో వచ్చి ఆగింది. ప్రయాణికులు బస్సును ఎక్కుతున్న సమయంలో ఆకస్మాత్తుగా గుంతలో కూరుకుపోయింది. తర్వాత కొన్ని సెకన్ల వ్యవధిలో మంటలు చెలరేగడంతో పాటు బస్సు మొత్తం అందులోకి కూరుకుపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా,10 మంది ఆచూకీ లభించలేదు. కాగా ఈ ప్రమాదం సోమవారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో జరిగినట్లు సీసీటీవి ఫుటేజీ ఆధారంగా తెలుస్తుంది.

అయితే ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బస్సులో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారన్న విషయం తెలియడం లేదు. ప్రమాద సమయంలో ప్రయాణికులు గుంతలో పడిన దృశ్యాలు రికార్డయ్యాయి.దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న రెస్క్యూ బలగాలు ఘటనా స్థలికి చేరుకొని ఆపరేషన్‌ నిర్వహించి బస్సును బయటికి తీశారు. కాగా గుంతలో పడిన వారిలో ఇప్పటివరకు 16 మందిని బయటికి తీసి ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ తరహా ఘటనలు చోటుచేసుకోవడం చైనాలో కొత్తేం కాదు. ఇంతకుముందు చైనాలోని షెంజెన్‌ ఇండస్ట్రియల్‌ ప్రాంతంలో 10 మీటర్ల మేర భారీ గుంత ఏర్పడి ఐదుగురు మృతి చెందారు.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ