amp pages | Sakshi

కళ్లు తిరిగే సాహసం..మోడల్‌కు సమన్లు

Published on Sun, 02/19/2017 - 16:59

దుబాయ్:
ఓ సాహస మోడల్‌కు దుబాయ్‌ పోలీసులు సమన్లు జారీ చేశారు. ఎత్తయిన భవనం వద్ద రష్యన్ మోడల్ వికీ ఓడింట్కోవా చేసిన సాహసం ప్రాణాలతో చెలగాటం ఆడటం లాంటిదని పోలీసు ఉన్నతాధికారి ఖలీల్‌ ఇబ్రహీం మన్సూరీ పేర్కొన్నారు. ఎలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించకుండా దుబాయ్‌లో ప్రాణాలకు అపాయం కలిగించే సాహసాలు చేయొద్దని సూచించారు. సంబంధిత అధికారుల నుంచి పర్మిషన్‌ తీసుకున్న తర్వాతే ఇలాంటివి చేయాలన్నారు.

ఎత్తయిన భవనం వద్ద రష్యన్ మోడల్ చేసిన సాహసం కళ్లు తిరిగేలా ఉంది. దుబాయ్‌లోని ఓ ఆకాశహర్మ్యం ఎక్కింది. అక్కడ పై అంతస్తు వద్ద ఓ వ్యక్తిని ఇవతల నిలబెట్టి, కేవలం అతడి చెయ్యి మాత్రమే పట్టుకుని గాల్లో వేలాడింది. ఏమాత్రం పట్టు తప్పినా వెయ్యి అడుగుల కిందకు పడి తల వంద ముక్కలు కావాల్సిందే. 73 అంతస్థులకు పైగా ఉన్న అలాంటి భవనం ఎక్కి మామూలుగా కిటికీలోంచి కిందకు చూస్తేనే మనకు కళ్లు తిరుగుతాయి. అలాంటిది ఈ మోడల్ ఏకంగా కిటికీలోంచి బయట గాల్లోకి వేలాడిందంటే.. చెప్పాలా! ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో కూడా తీసి దాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోను ఇప్పటికి ఐదు లక్షల మందికిపైగా చూశారు.
 

 

Full video (link in bio)! @a_mavrin #MAVRINmodels #MAVRIN #VikiOdintcova #Dubai

A post shared by Viki Odintcova (@viki_odintcova) on