ఏటీఎంలో పట్టపగలే పాడుపనులా..!

Published on Sun, 02/26/2017 - 17:27

మెక్సికో సిటీ: ఏటీఏం సెంటర్లోకి వెళ్లిన ఓ జంట అందరిలా డబ్బులు డ్రా చేసుకుని బయటకు రాకుండా.. పాడు పనులు చేస్తూ లోపలే ఉండిపోయింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఓ వ్యక్తి డోర్ ఓపెన్ చేసి ఆ జంట ఏటీఎం లోపల చేస్తున్న అసాంఘిక కార్యకలాపాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ విచిత్ర ఘటన మెక్సికోలోని ఆక్సాకా సిటీలో శనివారం చోటుచేసుకుంది. ఆక్సాకాలోని ఎడ్యూకేషన్ ఆథారిటీ ప్రధాన కేంద్రానికి సమీపంలో ఓ ఏటీఎం సెంటర్ ఉంది. టీచర్లుగా భావిస్తున్న ఓ జంట డబ్బు డ్రా చేసేందుకు ఈ ఏటీఎంలోకి వెళ్లారు. బయట మరికొందరు డబ్బు డ్రా చేసుకునేందుకు కొంత సమయం ఎదురుచూశారు.

ఓపిక నశించిన ఓ వ్యక్తి డోర్ ఓపెన్ చేసి లోపల జరుగుతున్న దృశ్యాన్ని చూసి షాక్ తిన్నాడు. లోపలకు వెళ్లి కొంత సమయం గడిపిన జంట టాప్స్ తో అర్ధనగ్నంగా ఉంది. శృంగారంలో పాల్గొంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పబ్లిక్ ప్లేస్ కావడం, అందులోనూ డబ్బుల కోసం ఎంతో మంది వచ్చే ఏటీఎం సెంటర్లో ఇలాంటి పనులు చేస్తారా అంటూ ఏటీఎం బయట ఉన్నవాళ్లు వారి చర్యపై తీవ్రంగా స్పందించారు. అందరూ వారిని చూస్తున్నట్లు గమనించిన ఆ జంట వెంటనే డ్రెస్ వేసుకుని అక్కడినుంచి వెళ్లిపోయారు. వారి వివరాలు మాత్రం తెలియరాలేదు. ఓ వ్యక్తి మాత్రం తన స్మార్ట్ ఫోన్లో ఆ జంట అసాంఘిక కార్యకలాపాలను వీడియో తీసి 'ఆక్సాకాలో ఏం జరుగుతుందో అందరూ తెలుసుకోండి' అనే క్యాప్షన్ పెట్టి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ గా మారడంతో.. ఆ జంట చేసిన పాడుపనిపై నెటిజన్ల నుంచి సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Videos

జేఈఈ మెయిన్స్‌లో సత్తాచాటిన గిరిజన బాలికలు

నిరుపేదలకు తీరిన సొంతింటి కల

KSR Live Show: పచ్చ పత్రికల్లో పచ్చి అబద్దాలు

KSR Live Show: కార్యకర్తలను ఉసిగొల్పడం.. చంద్రబాబుకు అలవాటే

రామోజీ చేసింది ముమ్మాటికీ తప్పే: బీజేపీ నేత

Photos

+5

ఇన్నాళ్లకు గుర్తొచ్చామా వాన!

+5

అన్నదాతలకు వైఎస్ జగన్ ఆపన్నహస్తం

+5

రైతు దీక్ష పోస్టర్‌ ఆవిష్కరణ

+5

'హుదూద్' విలయ తాండవం

+5

వైఎస్ జగన్ రైతు భరోసాయాత్ర ప్రారంభం

+5

బ్యూటీ ఫుల్.. బతుకమ్మ