amp pages | Sakshi

సింహంతో సర్కస్‌ షో.. చిన్నారిపై పంజా

Published on Tue, 10/30/2018 - 09:52

మాస్కో: సర‍్కస్‌లో విన్యాసాలు చేయాల్సిన సింహం ఓ చిన్నారిపై దాడి చేసింది. షో చూస్తున్న నాలుగేళ్ల చిన్నారిపై పంజా విసిరి అమాంతం తినేందుకు ప్రయత్నించింది. సిబ్బంది అప్రమత్తం కావడంతో చిన్నారి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది. రష్యాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

రష్యాలోని క్రాస్‌నోడార్‌ నగరంలోని ఓ గ్రామంలో సింహంతో సర్కస్‌ షో నిర్వహించారు.  ప్రేక్షకులు షోను భలే ఎంజాయ్ చేస్తున్నారు. సింహం ఉన్న బోనులోకి వెళ్లిన ట్రెయినర్‌ దానితో ఫీట్లు చేయిస్తున్నాడు. షోకి వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారి కూడా ఆ సింహం చేస్తున్న విన్యాసాలు చూస్తూ చప్పట్లు కొడుతోంది. ఇంతలోనే ట్రేయినర్‌ దానితో మరో విన్యాసం చేయిద్దామని పక్కకి తీసుకొచ్చాడు. సింహం అలా నేలపై ఒరిగింది. ట్రేయినర్‌ ప్రేక్షకుల వైపు చూస్తూ ఎదో చెప్పబోతున్నాడు. అంతే వెంటనే పరుగెత్తి  బోను దగ్గరలో ఉన్న ఓ చిన్నారిపై పంజా విసిరింది. బోనులోపలకి లాక్కొచ్చి అమాంతం తినేందుకు ప్రయత్నించగా సిబ్బంది రక్షించారు.

సింహం పంజా విసరడంతో చిన్నారి ముఖంపై తీవ్ర గాయాలయ్యాయని, వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించామని షో నిర్వాహకులు తెలిపారు. కాగా ప్రేక్షకులకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా షో నిర్వహించడం వల్లే ప్రమాదం జరిగిందని విచారణ కమిటి తేల్చి చెప్పింది. సర్కస్‌ డైరెక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.

రష్యాలో ఇలాంటి ఘటనలు జరగడం సర్వసాధారణం. 2016లో నిర్వహించిన ఓ లైవ్‌ షోలో ఓ మహిళపై సింహం దాడి చేసింది. ఈ ఘటనలో మహిళా అక్కడికక్కడే మృతి చెందారు. 2012లో మాస్కోలో ఓ చిరుత ఏడేళ్ల బాలుడిపై దాడి చేసింది. అదే ఏడాదిలో జూపార్క్‌లో ఉన్న ఓ పులి మూడేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసింది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)