amp pages | Sakshi

గత అధ్యక్షులు విఫలం

Published on Tue, 06/12/2018 - 02:06

వాషింగ్టన్‌: కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన కోసం గతంలో అమెరికా చేసిన ప్రయ త్నాలన్నీ బెడిసికొట్టాయి. ఆ విషయంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన 11 మంది ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేకపోయా రు. 1960ల్లో కెన్నడీ, జాన్సన్‌ అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఉత్తర కొరియాతో కొంతవరకు సత్సంబంధాలు కొనసాగాయి. 1968లో అమెరికా నిఘా నౌకల్ని నిర్బంధించడంతో పాటు గూఢచర్య విమానాల్ని ఉత్తర కొరియా పేల్చివేసింది.

ఆ తర్వాత రెండేళ్లకి ఉత్తర కొరియా తన ధోరణి మార్చుకుని శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించింది. 1974 అనంతరం అప్పటి ఉత్తర కొరియా అధినేత కిమ్‌ ఇల్‌ సంగ్, అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్‌తో శాంతి ఒప్పందానికి ప్రయత్నాలు చేశారు. అయితే చర్చల్లో ముందడుగు పడలేదు. 1981 లో అధ్యక్షుడు రోనాల్డ్‌ రీగన్‌ శాంతి ఒప్పందాన్ని వ్యతిరేకించారు. దక్షిణా కొరియాను సమర్థిస్తూ మిలటరీ బలగాల్ని పెంచారు. ఆ తర్వాతి అధ్యక్షుడు జార్జ్‌ బుష్‌(సీనియర్‌) దక్షిణకొరియా నుంచి భారీగా సైన్యాన్ని వెనక్కి రప్పించారు. అయితే ఉత్తరకొరియాతో శాంతి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వలేదు.

1993–2001 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న బిల్‌ క్లింటన్‌ ఉత్తర కొరియాతో సంక్షోభ పరిష్కారానికి కొంతవరకు ప్రయత్నాలు చేశారు. పదేళ్ల పాటు శాంతియుత సంబంధాలే కొనసాగినా, జార్జ్‌ బుష్‌(జూనియర్‌) అధ్యక్షుడయ్యాక మళ్లీ సంబంధాలు క్షీణించాయి. ఉ.కొరియాతో సంబంధాల విషయంలో ఒబామా సంయమనం పాటించారు. ఆంక్షలతో దారికి వస్తుం దని భావించారు. 2011లో ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టిన కిమ్‌ ఆంక్షల్ని లెక్క చేయకుం డా అణుపరీక్షలు కొనసాగించారు. ఈ సారైనా ఇరు దేశాల మధ్య చర్చలు ముందుకు వెళ్తా యా? లేక గతంలో మాదిరిగా ప్రహసనంగా మారుతుం దా? అన్నది ట్రంప్‌ చేతుల్లోనే ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Videos

గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం

ఊసరవెల్లి కన్నా డేంజర్

డిప్యూటీ సీఎం పై సీఎం రమేష్ అనుచరుల కుట్ర

అడుగడుగునా నీరాజనం..వైఎస్ భారతి ఎన్నికల ప్రచారం

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)