amp pages | Sakshi

రిజర్వేషన్ల పెంపుపై నేడు సమావేశం

Published on Fri, 04/27/2018 - 01:26

సాక్షి, హైదరాబాద్‌: కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ముస్లిం, ఎస్టీ రిజర్వేషన్ల బిల్లు, పీడీ యాక్ట్‌ సవరణకు సంబంధించిన బిల్లులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖ ప్రత్యేక సమావేశం ఏర్పా టు చేసింది. శుక్రవారం హోం శాఖ అదనపు కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో ఈ సమావేశం జరగనుంది. పెండింగ్‌లో ఉన్న బిల్లులకు సంబందించి కేంద్రం కోరిన వివరణలు, సమగ్ర ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

ముస్లిం, గిరిజన రిజర్వేషన్లు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది పంపిన బిల్లుపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ముస్లిం రిజర్వేషన్లను (బీసీ–ఈ కోటా) 4 శాతం నుంచి 12 శాతానికి, ఎస్టీలకు 6 నుంచి 10 శాతా నికి పెంచేందుకు రూపొందించిన బిల్లును అసెం బ్లీ ఆమోదించింది. కేంద్రం పెండింగ్‌లో పెట్టింది. ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు నిలిపేయాలని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ హోం శాఖకు సూచించింది.

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రధాన కారణం గా చూపింది. ఎస్టీలకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్రం పంపిన బిల్లులోని అంశాల ను కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ సమర్థించిం ది. రెండు శాఖలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంతో రిజర్వేషన్ల పెంపు విషయంలో పీట ముడి పడింది. అలాగే పీడీ యాక్ట్‌ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది.

శుక్రవారం జరిగే సమావేశంలో పెండింగ్‌ బిల్లులపై ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ఆసక్తికరంగా మారింది. బిల్లులకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు, కేంద్రం లేవనెత్తిన అంశాలను నివేదించేందుకు సాధారణ పరిపాలన శాఖకు చెందిన సీనియర్‌ అధికారులు ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులపై ఈ సమావేశంలో చర్చించనుంది. తెలంగాణతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలను సైతం సమావేశానికి ఆహ్వానించింది.  

Videos

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)