amp pages | Sakshi

ఆదిత్యనాథ్ దాస్ కు హైకోర్టులో ఊరట

Published on Sat, 04/23/2016 - 01:56

ఆయనపై విచారణ ప్రక్రియ నిలిపివేత 
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

 సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్‌కు చేసిన నీటి కేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టులో ఆదిత్యనాథ్ దాస్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణా, కాగ్నా నదుల నుంచి ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల విషయంలో అప్పటి నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో ఆదిత్యనాథ్ దాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. దీనిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.

ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆదిత్యనాథ్ దాస్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఆదిత్యనాథ్ దాస్ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించాయని తెలిపారు. అనుమతి లేనప్పుడు సీబీఐ చేసిన అభియోగాల్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. అంతర్రాష్ట్ర జలమండలి అనుమతుల్లేకుండా నీటి కేటాయింపులు చేశారన్నది సీబీఐ ఆరోపణ అని, అయితే అనుమతులున్న విషయాన్ని సీబీఐ పట్టించుకోలేదని తెలిపారు.

ఈ వాదనలతో సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు విభేదించారు. దాస్ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించినప్పటికీ ఐపీసీ కింద కేసుల్ని విచారించవచ్చునన్నారు. ఈ దశలో కేసు విచారణను నిలిపివేయరాదని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి సీబీఐ కోర్టులో దాస్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేశారు.

Videos

లండన్ కు చేరుకున్న సీఎం జగన్

వ్యాక్సిన్ తో ముప్పు?.. ఏది నిజం?

తెలంగాణలో రైతుల్ని నిండా ముంచిన అకాల వర్షం

థియేటర్ కు వచ్చిన వారం రోజుల్లోనే..ఓటీటీలోకి కృష్ణమ్మ మూవీ..

ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

RCB vs CSK: ప్లే ఆఫ్స్‌ బెర్తుకై చావో రేవో

లక్నో విజయం.. ఓటమితో ముగించిన ముంబై!అట్టడుగున

బుట్టబొమ్మకి బంపర్ ఆఫర్..

ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు

చిన్నస్వామిలో కురిసేది సిక్సర్ల వర్షమే.. CSKకి ఇక కష్టమే..

Photos

+5

నటుడు చందు కన్నుమూత.. వైరలవుతున్న పెళ్లి ఫోటోలు

+5

Afghanistan Floods: అఫ్ఘాన్‌ కొట్టుకుపోయింది.. మిగిలింది శూన్యమే (ఫొటోలు)

+5

ఏపీలో గెలిచేదెవరు? జడ్జ్‌మెంట్‌ డే 4th June (ఫొటోలు)

+5

చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్

+5

Sangeetha Sringeri: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధి వద్ద నటి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)

+5

సంతోషంలో కావ్యా మారన్‌.. కేన్‌ విలియమ్సన్‌ను పలకరించి మరీ! (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ తల్లి పాదాలకు నమస్కరించిన శుబ్‌మన్‌ .. ఫొటోలు వైరల్‌

+5

ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?.. ఫేమస్‌ టీటీ ప్లేయర్‌!(ఫొటోలు)

+5

ఒకప్పుడు చిన్నపాటి గదిలో.. ఇప్పుడు హీరోలకు ధీటుగా రూ.550 కోట్ల సంపద.. ఎవరో గుర్తుపట్టారా? (ఫొటోలు)

+5

Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)